Booster Breakfast: బూస్టర్ బ్రేక్ ఫాస్ట్.. ఉదయం ఇది తింటే రోజంతా ఉత్సాహంగా ఉంటారు.. అలసట అసలే రాదు

రోజంతా శక్తివంతంగా ఉండాలంటే ఉదయం తీసుకునే బ్రేక్‌ఫాస్ట్(Booster Breakfast) ఎంతో కీలకం.

Booster Breakfast: బూస్టర్ బ్రేక్ ఫాస్ట్.. ఉదయం ఇది తింటే రోజంతా ఉత్సాహంగా ఉంటారు.. అలసట అసలే రాదు

Benefits of having a booster breakfast in the morning

Updated On : August 22, 2025 / 5:47 PM IST

Booster Breakfast: రోజంతా శక్తివంతంగా ఉండాలంటే ఉదయం తీసుకునే బ్రేక్‌ఫాస్ట్ (పలాహారం) ఎంతో కీలకం. ఉదయ భోజనం రాజ భోజనం లా ఉండాలి అనే మాట మనం వింటూనే ఉంటాం. అందుకే ఉందయం తీసుకునే ఆహరం చాలా ప్రధానం. కాబట్టి, ఉదయం బూస్టర్ బ్రేక్ ఫాస్ట్(Booster Breakfast) తీసుకోవడం ఉత్తమ ఫలితాలను అందిస్తుంసి. ఇది శరీరానికి, మెదడుకి అవసరమైన శక్తిని అందిస్తుంది. అలాగే శరీరానికి తక్షణ ఉత్సాహాన్ని అందించడమే కాకుండా, రోజంతా ఉత్సాహంగా ఉండేందుకు బలాన్ని ఇస్తుంది. ఇప్పుడు, ఆ బూస్టర్ బ్రేక్‌ఫాస్ట్ గురించి పూర్తి వివరంగా తెలుసుకుందాం.

Eye Health: తరుచుగా కంటినుండి నీరు కారుతుందా.. ఆ వ్యాధి లక్షణం కావచ్చు.. జాగ్రత్త సుమీ!

బూస్టర్ బ్రేక్‌ఫాస్ట్ అంటే ఏమిటి?
బూస్టర్ బ్రేక్‌ఫాస్ట్ అంటే ప్రోటీన్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు సమతుల్యంగా ఉండే ఆహారం. ఇది శరీరానికి వెంటనే శక్తిని అందిస్తుంది, జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది, మానసిక స్పష్టతను పెంపొందిస్తుంది.

ఈ బూస్టర్ బ్రేక్‌ఫాస్ట్ లో ఉండాల్సిన ముఖ్యమైన పదార్థాలు:

1.ప్రోటీన్:
ఇది గుడ్లు, పాలు, పెరుగు, పన్నీర్, స్ప్రౌట్స్, నట్స్ లలో ఎక్కువగా లభిస్తుంది. ఇవి శరీరానికి శక్తిని అందిస్తాయి, కండరాల శక్తిని నిలుపుతాయి.

2.కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు:
ఓట్స్, మల్టీ గ్రెయిన్ బ్రెడ్, మిల్లెట్ (సజ్జలు, బాజ్రా, జొన్న) లలో ఇది ఎక్కువగా లభిస్తుంది. ఇది దీర్ఘకాలిక శక్తిని అందిస్తుంది.

3.ఫైబర్:
పండ్లు, కూరగాయలు, నట్స్, చియా సీడ్స్ లలో అధికంగా లభిస్తుంది. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి, ఆకలిని నియంత్రిస్తాయి.

4.హెల్తీ ఫ్యాట్స్:
అవకాడో, నారియల్ నూనె, బాదం, వాల్‌నట్స్ లలో ఎక్కువగా లభించే హెల్తీ ఫ్యాట్స్ మెదడు ఆరోగ్యానికి చాలా అవసరం.

కొన్ని బూస్టర్ బ్రేక్‌ఫాస్ట్ లు మీకోసం:

  • గుడ్డు,బ్రౌన్ బ్రెడ్ టోస్ట్ + ఓట్ మిల్క్
  • మిక్స్‌డ్ మిల్లెట్ ఉప్మా (జొన్న/రాగి/బాజ్రా)
  • పండ్లు, నట్స్, గింజలు తో చేసిన స్మూథీ బౌల్
  • స్ప్రౌటెడ్ మొలకల తినుబండారం + పెరుగు
  • చియా సీడ్ పుడింగ్ + తేనె + సీజనల్ ఫలాలు
  • వెజిటేబుల్ ఓట్స్ పొంగల్
  • పుట్టగొడుగు, గ్రీన్స్ తో చేసిన మినప్పప్పు దోస

బూస్టర్ బ్రేక్‌ఫాస్ట్ ప్రయోజనాలు:

  • ఉదయం శక్తివంతమైన ఆరంభం
  • శరీరానికి, మెదడుకి తక్షణ శక్తి
  • డయాబెటిస్, ఒబెసిటీ సమస్యల నివారణ
  • ఆకలి నియంత్రన
  • పని మీద ఏకాగ్రతను పెంచుతుంది.