Women Health: మహిళలకు వంటగదే ఫిట్‌నెస్ జోన్.. మధ్యలో చిన్న వ్యాయామం.. ఎన్ని సమస్యలు నయం అవుతాయో తెలుసా?
సాధారణంగా మహిళలు ఎక్కువగా వంటింట్లోనే(Women Health) ఎక్కువగా కనిపిస్తారు. అలాగే రోజు ఎదో ఒక పనిలో తీరిక లేకుండా ఉంటారు కాబట్టి,

small exercises can do while cooking for women health
Women Health: సాధారణంగా మహిళలు ఎక్కువగా వంటింట్లోనే ఎక్కువగా కనిపిస్తారు. అలాగే రోజు ఎదో ఒక పనిలో తీరిక లేకుండా ఉంటారు కాబట్టి, ప్రత్యేకంగా వ్యాయాయం చేయాలంటే సమయం దొరకడం లేదని అంటూ ఉంటారు. అందుకే వంట గదిలోనే చేయగలిగే ఏమైనా వ్యాయామం ఉంటే మహిళల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. వంట మధ్యలో చిన్న చిన్న వ్యాయామాలు జతచేసి ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరుచుకోవచ్చు. ప్రత్యేకంగా జిమ్‌కి వెళ్లే సమయం లేకపోయినా వంటగదే ఫిట్‌నెస్ జోన్ అవుతుంది. కాబట్టి, మహిళలు వంట చేసే(Women Health) సమయంలో చేయగలిగే సరళమైన వ్యాయామాలు, వాటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
1.కాలి వేళ్ళపై నిలబడటం:
వంటగదిలో వంటి చేస్తున్నప్పుడు కిచెన్ సింక్ ముందు నిలబడి కాలి వేళ్ళపై నెమ్మదిగా పైకి లేచి, మళ్లీ క్రిందకి ఉంచడం చేయాలి. ఇలా రోజు 10 నుంచి15 సార్లు చేయాలి. ఇలా చేయడం వల్ల కాళ్ల కండరాలలో బలం పెరుగుతుంది. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. గుండె ఆరోగ్యంగా మారుతుంది.
2.కౌంటర్ స్క్వాట్స్:
కిచెన్ కౌంటర్ పట్టుకుని నిలబడి ఉండాలి. నెమ్మదిగా మోకాలిని వంచుతూ కూర్చోవాలి. నెమ్మదిగా మళ్లీ పైకి లేవాలి. ఇలా రోజుకు 10 నుంచి 15 స్క్వాట్స్ చేయడం వల్ల తొడల బలం పెరుగుతుంది. నడుము, వెన్నెముక ఆరోగ్యం మెరుగవుతుంది. మెటబాలిజం వేగవంతం అవుతుంది.
3.వంట చేస్తూనే నడక:
వంట వేస్తున్న సమయంలో మీ చోట నుంచే చిన్నగా కాళ్లను ఎత్తుతూ నడవండి. ఇలా 15 నిమిషాలు చేయడం వల్ల కాలరీలు తక్కువ సమయంలోనే ఖర్చవుతాయి. పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు తగ్గుతుంది. అలాగే గుండె ఆరోగ్యం మెరుగవుతుంది.
4.వాల్ పుష్-అప్‌లు:
వంట గదిలో ఖాళీ గోడ ఎదురు కాస్త దూరంగా నిలబడి చేతులు గోడపై ఉంచాలి. ఇప్పుడు నెమ్మదిగా ముందుకు వాలి, మళ్లీ వెనక్కి రావాలి. ఇలా రోజుకు 10 నుంచి 12 సార్లు చేయవచ్చు. ఇలా చేయడం వల్ల భుజాలు, చేతులకు బలం లభిస్తుంది. అలాగే హార్మోన్ల సమతుల్యతకు సహాయపడుతుంది. మానసిక చురుకుతనం పెరుగుతుంది.
5.వంట గదిలో స్ట్రెచింగ్:
చేతులు పైకి లేపి, పక్కలవైపు వంచి స్ట్రెచ్ చేయాలి. అలాగే చేతుల్ని వెనక్కి లాగుతూ ఛాతిని ముందుగా చేయవచ్చు.ఇలా 10 నుంచి 20 సెకండ్లు ఒక్కో స్ట్రెచ్ చేయాలి. ఇలాప్రతీరోజు చేయడం వల్ల శ్వాస మార్గం విస్తరణ ఏర్పడుతుంది. నిద్ర మెరుగుదల అవుతుంది. శారీరక అలసట తగ్గుతుంది.
వ్యాయామాలతో పాటు సరైన అలవాట్లు:
- వంట సమయంలో నీళ్లు ఎక్కువగా తాగండి
- తక్కువ గ్లూకోజ్ ఉన్న పండ్లు తినాలి
- హుషారుగా ఉండేందుకు మీకు ఇష్టమైన సంగీతం వినండి.