Backward Walking: నడక వెనక్కి ఆరోగ్యం ముందుకి.. వెనుక నడక చేసే మ్యాజిక్.. గుండె, షుగర్, మెదడు అన్నీ సేఫ్
నడక అనేది సాధారణంగా అందరికీ అందుబాటులో ఉండే వ్యాయామం. (Backward Walking)చాలా ఆరోగ్యం కోసం ఉదయం నడుస్తూ ఉంటారు.

Health benefits of walking backward
Backward Walking: నడక అనేది సాధారణంగా అందరికీ అందుబాటులో ఉండే వ్యాయామం. చాలా ఆరోగ్యం కోసం ఉదయం నడుస్తూ ఉంటారు. నడక వల్ల అనేకరకాల రోగాలు నయం అవుతాయి. కానీ, వెనక్కి నడక అనేది పురాతన యోగాభ్యాసాలలోనూ, ఆధునిక ఫిజియోథెరపీ విధానాల్లోనూ ఓ ప్రత్యేక స్థానం కలిగిఉంది. ఈ తరహా నడక శరీరానికి కొత్త కోణంలో వ్యాయామాన్ని అందించడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. మరి వెనక్కి నడవడం(Backward Walking) వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
AC Side Effects: ఏసీకి అలవాటు పడితే అంతే సంగతులు.. ఈ సమస్యలు రావడం ఖాయం
1.మోకాలికి మద్దతు, కీళ్ల నొప్పులపై ఉపశమనం:
వెనక్కి నడక సమయంలో మోకాలి పై ఒత్తిడి ముందుకు నడిచే దానికంటే తక్కువగా ఉంటుంది. ఇది పటెల్లోఫెమోరల్ పెయిన్ సిండ్రోమ్ (Runner’s Knee) వంటి మోకాలి సమస్యలకు ఉపశమనం ఇస్తుంది. ఫిజియోథెరపీ విధానాల్లో వెనక్కి నడకను ఒక ఉపచారంగా ఇప్పటికీ వినియోగిస్తున్నారు.
2.మేధస్సుకు శక్తివంతమైన వ్యాయామం:
వెనక్కి నడవడం అనేది మానసికంగా అప్రమత్తతను పెంచుతుంది. ఎందుకంటే ఇది మానసిక దృష్టిని, కోఆర్డినేషన్‌ను పరీక్షించే క్రియ. ఇది మెదడు పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. కొన్ని పరిశోధనల ప్రకారం, వెనక్కి నడిచిన వారు తమ జ్ఞాపకశక్తి మెరుగుపడినట్టు తెలిపారట.
3.శరీర సమతుల్యత మెరుగవుతుంది:
వెనక్కి నడవడం శరీర స్థిరత్వాన్ని పెంచుతుంది. ప్రత్యేకంగా వృద్ధులలో ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. పడిపోయే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
4.ప్యానిక్, ఒత్తిడికి తగ్గుదల:
నెమ్మదిగా వెనక్కి నడవడం వల్ల శ్వాస నియంత్రణలో ఉంటుంది. ఇది మైండ్‌ఫుల్ నడకలాగా పని చేస్తుంది. దీని వల్ల మనస్సు ప్రశాంతంగా మారి, ఒత్తిడి తగ్గుతుంది.
5.ఎక్కువ క్యాలరీలు ఖర్చు అవుతాయి:
వెనక్కి నడవడం అనేది ముందుకు నడకకన్నా కాస్త కష్టంగా ఉంటుంది. కాబట్టి మరింత శక్తిని వినియోగిస్తుంది. ఇలా చేయడం వల్ల మెటబాలిజాన్ని పెంచుతుంది, తద్వారా బరువు తగ్గే ప్రక్రియలో సహాయపడుతుంది.
6.వెన్నెముకకు వ్యాయామం:
వెనక్కి నడక చేస్తే పీపీఐ మెరుగవుతుంది. ఇది వెన్నెముక సరిగా నిలవడానికి సహాయపడుతుంది, పొట్ట బయటకు వచ్చే సమస్యను నియంత్రించడంలో తోడ్పడుతుంది.
ముఖ్యమైన సూచనలు:
- సాఫీగా ఉండే మైదానంలో నడక ప్రారంభించండి
- మొదట 2 నుంచి 3 నిమిషాలు మాత్రమే నడవండి
- చేతులను కదిలిస్తూ నడవాలి
- అవసరమైతే మరోకరి సహాయం తీసుకోవాలి.