Periods: పీరియడ్స్ ఆపడానికి మందులు వాడుతున్నారా? ఇది ప్రాణాలతో చెలగాటమే.. జాగ్రత్త సుమీ

ప్రస్తుతం కాలంలో కొంతమంది మహిళలు పీరియడ్స్(Periods) వచ్చే సమయాన్ని వాయిదా వేయడం కోసం మెడిసిన్ వాడటం సాధారణం

Periods: పీరియడ్స్ ఆపడానికి మందులు వాడుతున్నారా? ఇది ప్రాణాలతో చెలగాటమే.. జాగ్రత్త సుమీ

Using medication to stop periods is dangerous

Updated On : August 24, 2025 / 6:26 PM IST

Periods: ప్రస్తుతం కాలంలో కొంతమంది మహిళలు పీరియడ్స్ వచ్చే సమయాన్ని వాయిదా వేయడం కోసం మెడిసిన్ వాడటం సాధారణం అయిపొయింది. ప్రయాణాలు, ప్రత్యేక కార్యక్రమాలు, పెళ్లిళ్లు వంటి సందర్భాలలో ఇది సాధారణంగా జరుగుతూనే ఉంటుంది. అయితే, ఇలాంటి మందులు వాడటం వల్ల తాత్కాలికంగా సమస్య(Periods) పరిష్కారం అయినప్పటికీ దీర్ఘకాలికంగా అనేక ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు ప్రమాదకరం కావచ్చు. అలాంటి విషయాల గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

Women Health: మహిళలకు వంటగదే ఫిట్‌నెస్ జోన్.. మధ్యలో చిన్న వ్యాయామం.. ఎన్ని సమస్యలు నయం అవుతాయో తెలుసా?

పీరియడ్స్ ఆపే మందులు ఎలా పనిచేస్తాయి:
ఈ మందులు సాధారణంగా హార్మోనల్ మోడ్‌లో పనిచేస్తాయి. ముఖ్యంగా ప్రొజెస్టెరోన్ లేదా ఎస్ట్రోజెన్-ప్రొజెస్టెరోన్ మిశ్రమాలతో తయారవుతాయి. ఇవి యుటరస్‌లో లైనింగ్‌ను స్థిరంగా ఉంచి రక్తస్రావాన్ని ఆపేస్తాయి. దానివల్ల పీరియడ్స్ రావడం కొంతకాలం నిలిపివేస్తుంది.

పీరియడ్స్ ఆపే మందులు వాడటం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు:

1.హార్మోనల్ అసమతుల్యత:
ఈ మందులు శరీరంలోని సహజ హార్మోన్ విడుదల ప్రక్రియను నిలిపివేస్తాయి. దీని వల్ల గర్భసంచి గోడ సరిగ్గా ఏర్పడకపోవడం, ఫెర్టిలిటీ సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది.

2.అనియమిత మాసిక ధర్మం:
మందుల వాడకం మానేసిన తర్వాత కొన్ని నెలల పాటు పీరియడ్స్ గడవులో గందరగోళ ఏర్పడవచ్చు. కొన్నిసార్లు పూర్తిగా పీరియడ్స్ ఆగిపోయే ప్రమాదం ఉంది.

3. రక్తస్రావ సమస్యలు:
మందులు తీసుకుంటూ ఉన్నప్పటికీ మధ్యలో స్వల్పంగా రక్తస్రావం జరిగే అవకాశముంది. కొన్ని రోజుల పాటు నిరంతరంగా రక్తశ్రావం కావచ్చు. కొన్నిసార్లు ఇది ప్రాణాపాయం కూడా కావచ్చు.

4.బరువు పెరుగడం, మానసిక ఒత్తిడి:
హార్మోనల్ మందుల వల్ల నీరు నిల్వ, ఆకలి వేయడం వల్ల బరువు పెరిగే ప్రమాదం ఉంది. మూడ్ స్వింగ్స్, చిరాకు, డిప్రెషన్ లాంటి మానసిక సమస్యలు పెరిగే అవకాశం ఉంది.

5.హృదయ సంబంధిత ప్రమాదాలు:
దీర్ఘకాలంగా హార్మోన్ల మందులు వాడడం వల్ల రక్తపు గడ్డలుగా ఏర్పడి గుండెపోటు, స్ట్రోక్ వంటి ప్రమాదకరమైన సమస్యలు తలెత్తవచ్చు. ముఖ్యంగా పొగతాగే మహిళలకి ఇది చాలా ప్రమాదకరం.

ఈ మందులు ఎవరికి ప్రమాదకరం:

  • అధిక బరువు ఉన్నవారు
  • మధుమేహం ఉన్నవారు
  • గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు
  • పొగతాగే మహిళలు

తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

  • వైద్యుడి సలహా లేకుండా తీసుకోవద్దు.
  • ఒక సంవత్సరంలో 1 నుంచి 2 సార్లు మాత్రమే తీసుకోవాలి.
  • ఇతర సహజ మార్గాల ద్వారా పీరియడ్స్ సౌకర్యవంతంగా ఉండేలా చూసుకోవాలి.
  • ఎలాంటి వింత లక్షణాలు కనిపించినా డాక్టర్‌ను సంప్రదించాలి.