Will using sanitary pads cause infertility problems?
ప్రస్తుత కాలంలో మహిళలు తమ నెలసరి సమయంలో సాధారణంగా శానిటరీ ప్యాడ్స్‌ను వాడుతుంటారు. ఇవి సౌకర్యవంతంగానూ, శుభ్రతగానూ ఉంటాయి. అందుకే వీటిని ఎక్కువగా వినియోగిస్తారు. అయితే, ఈ మధ్య కాలంలో చాలా మందిలో వస్తున్న సందేహం ఏంటంటే? శానిటరీ ప్యాడ్స్ వాడటం వల్ల సంతానలేమి (Infertility) సమస్యలు వస్తాయా అని? మరి ఆ సందేహానికి సమాదానాన్ని అలాగే ఎలాంటి ప్యాడ్స్ వాడటం మంచిది అనేది విషయం గురించి ఇక్కడ తెలుసుకుందాం.
శానిటరీ ప్యాడ్స్ అనేవి నెలసరి సమయంలో రక్తాన్ని శోషించేందుకు రూపొందించబడినవి. వీటిని వాడటం వల్ల స్త్రీలు నెలసరి రోజుల్లో సౌకర్యవంతంగా ఉండగలుగుతారు.
సాధారణంగా శానిటరీ ప్యాడ్స్ వాడటం వల్ల నేరుగా సంతానలేమి సమస్యలు రావు. కానీ, ప్యాడ్స్‌ను సరిగ్గా వాడకపోవడం, నిబంధనలు పాటించకపోవడం వల్ల కొన్ని ఆరోగ్య సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అవి పరోక్షంగా పునరుత్పత్తి వ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది.
బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్:
ఒకే ప్యాడ్‌ను చాలా గంటల పాటు వాడితే, తేమతో కూడిన వాతావరణం వల్ల బ్యాక్టీరియా పెరుగుతుంది.
ఇది వెజైనల్ ఇన్ఫెక్షన్, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ (UTI)లకు దారి తీస్తుంది.
పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ (PID):
ఇన్ఫెక్షన్ శరీరంలో పైభాగానికి వ్యాపిస్తే, గర్భాశయానికీ, ఫల్లోపియన్ ట్యూబ్‌లకూ ఇన్ఫెక్షన్ కలుగుతుంది.
దీర్ఘకాలిక PID వల్ల గర్భధారణకు అవాంతరాలు ఏర్పడే అవకాశముంది.
అలర్జీలు, చర్మ సమస్యలు:
కొన్ని నకిలీ, లో క్వాలిటీ ప్యాడ్స్‌లో ఉండే కెమికల్స్, ఫ్రాగ్రెన్స్‌ల వల్ల చర్మంపై రాషెస్, డిస్చార్జ్ వంటి సమస్యలు తలెత్తవచ్చు.
ప్యాడ్‌ను ప్రతి 4 నుంచి 6 గంటలకొకసారి మార్చుకోవాలి. ఎక్కువసేపు ఉంచితే బ్యాక్టీరియా పెరిగే ప్రమాదం ఉంటుంది. ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది.
నాణ్యమైన బ్రాండ్స్ వాడుకోవాలి:
హైజీనిక్ స్టాండర్డ్స్‌కు అనుగుణంగా తయారైన ప్యాడ్స్‌ను మాత్రమే వాడాలి. లో క్వాలిటీ, నకిలీ ఉత్పత్తుల వాడకం నివారించాలి.
వెజైనల్ శుభ్రత పాటించడం:
నెలసరి సమయంలో ప్రతి రోజు శుభ్రంగా ఉండాలి. వెజైనల్ భాగాన్ని శుభ్రం చేసుకోవాలి.
శానిటరీ ప్యాడ్స్‌ను సరిగ్గా, పరిశుభ్రతతో వాడితే అవి ఆరోగ్యపరంగా హానికరం కావు. సరిగా వాడకపోవడం వల్ల ఏర్పడే ఇన్ఫెక్షన్లే పరోక్షంగా పునరుత్పత్తి వ్యవస్థపై ప్రభావం చూపుతాయి. కనుక నెలసరి సమయంలో హైజీన్ పాటించడం, నాణ్యమైన ఉత్పత్తులు వాడటం, లక్షణాలను గమనించడం ముఖ్యం.