ఆఫర్ ఉంది కదా అని.. సరదాగా బయటికి వెళ్లామని ఏదో ఒకటి రుచికరంగా ఆర్డర్ ఇచ్చి తొందరపడ్డామా తప్పులో కాలేసినట్లే. ఫాస్ట ఫుడ్‌కు బాగా అలవాటు పడ్డ భోజన ప్రియులు రెస్టారెంట్లకు వెళ్లి తమకు నచ్చిన ఆహార పదార్థాలను విచ్చలవిడిగా తినేస్తుంటారు. వారికి తెలియదు ఆహార పదార్థాలే తమలోని వ్యర్థాలను పెంచుతున్నాయని. యూనివర్సిటీ ఆఫ్ పిట్స్‌బర్గ్ స్కూల్ ఆఫ్ హెల్త్ అండ్ రిహాబిలిటేషన్ సైన్సెస్ కు చెందిన డైటీషియన్ కరోలినా పాసరిల్లో తెలిపిన వివరాల ప్రకారం.. ఈ జాబితాలో ఉన్న ఫుడ్ మీరు డైలీ తీసుకునే వాటిలో ఉందేమో ఒకసారి చూసుకోండి.
వింగ్స్, సాస్:
కోడి, పశువుల చివరి భాగాలను వేయించి రంగురంగుల్లో ఓ వెన్న గిన్నెతో మనముందుంచితే లొట్టలేసుకుంటూ తినేస్తాం. దాంతో పాటు సాస్‌ను జోడించి మరీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటాం. ఈ సాస్‌లోనే 34 గ్రాములు కొవ్వు పదార్థాలు ఉండి 500వరకూ క్యాలరీలను శరీరానికి అందిస్తాయట.
సాస్‌కు బదులుగా కొబ్బరి పాలు తీసుకుంటే మంచిదని సూచిస్తున్నారు నిపుణులు.
పిజ్జా:
మాంసం, వెన్న, బ్రెడ్ వంటి హై క్యాలరీలు ఉన్న పదార్థాలతో తయారు చేసిన పిజ్జా చూడడానికే కాదు తినడానికీ బాగుంటుంది. శరీరమే అడ్డంగా తయ్యారయేందుకు దోహదపడుతుంది. ఒక పిజ్జాలోని సింగిల్ స్లైస్(ఒక ముక్క) 440 క్యాలరీలతో పాటు 23గ్రాముల కొవ్వును మీ శరీరంలో చేరుస్తుందట.
దీనికి బదులు వెజ్ పిజ్జాను తినడం, మిరియాలతో, పుట్టగొడుగులు, స్పినాచ్‌తో ఉన్న పిజ్జాలు తినడం ఉత్తమం.
చిప్స్:
అందరినీ ఆశ్చర్యపరిచే విషయమేమిటంటే.. నోటికి ఉప్పగా కారంగా అనిపించే చిప్స్ కూడా ఈ జాబితాలో ఉండటం. ఇది నిజం. బంగాళదుంప చిప్స్ అనేది చాలా చెత్త ఆహారాల్లో ఒకటి. శరీరానికి ఖాళీ క్యాలరీలను ఇవ్వడంతో పాటు సోడియం, కొవ్వులను సైతం అదనంగా అందిస్తుంటాయి. ఒక హాఫ్ కప్ చిప్స్ ద్వారా 400క్యాలరీలు, 30గ్రాముల ఫ్యాట్, 930గ్రాముల సోడియం శరీరానికి చేరుతుంది.
బీర్:
ఆఖరుగా ఈ జాబితాలో ఉన్న బీరు ఆకర్షించటమే కాదు.. చెడగొట్టడంలోనూ టాప్‌లోనే ఉంటుంది. దీనిని ద్రవ పదార్థంగానే కాదు, లిక్విడ్ బ్రెడ్‌గానూ పిలుస్తుంటారు. దానికి కారణం అంచుల్లో పేరుకుని ఉండే బుడగలే. హాఫ్ బీర్ గ్లాసు శరీరానికి 424 క్యాలరీల శక్తినిస్తుందట. ఇక లైట్ బీర్, స్ట్రాంగ్ బీర్‌లు కిక్కు ఎక్కడంలోనే తేడా కానీ, శరీరాన్ని చెడగొట్టడంలో మాత్రం రెండూ ఒకటే.