Yoga For fertility problems
ప్రస్తుత సమాజంలో చాలా మంది జంటలు సంతానలేమి సమస్యలతో బాధపడుతున్నారు. మారుతున్న జీవన విధానమా లేక ఆహారపు అలవాట్ల తెలియదు కానీ ఇవి మంచి జీవితంపైన తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. అయితే యోగాలో ఇలా సంతాన సమస్యలను దూరం చేసే కొన్ని ఆసనాలు ఉన్నాయి. ఇవి మనిషి ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా జీవక్రియలను క్రమబద్దీకరిస్తాయి. కాబట్టి, హార్మోన్స్, PCOD లేక ఇంకా ఏదైనా సమస్యలను నయం చేయడంలో సహాయపడుతుంది. కాబట్టి, ఇప్పుడు సంతాన సాఫల్యం కోసం యోగాలో ఎలాంటి ఆసనాలు ఉన్నాయి? ఏ ఏ ఆసనాలు ఎలా ఉపయోగపడతాయి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
భద్రాసనం: ఈ ఆసనం వల్ల ఆడవాళ్ళలో పెల్విక్ ప్రాంతానికి రక్తప్రసరణ బాగా జరుగుతుంది. దానివల్ల గర్భాశయ ఆరోగ్యానికి మేలుకలుగుతుంది. పురుషులలో స్పెర్మ్ కౌంట్ మరియు నాణ్యత పెరగడంలో సహాయపడుతుంది.
పశ్చిమోత్తానాసనం: ఈ ఆసనం వల్ల నరాలకు విశ్రాంతి కలుగుతుంది. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. హార్మోన్ల సమతుల్యతకు తోడ్పడుతుంది.
ధనురాసనం: ఇది పురుషుల మరియు మహిళలలో సంతాన సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. రిప్రొడక్టివ్ ఆర్గన్స్‌ను శక్తివంతం చేస్తుంది.
సర్వాంగాసనం: ఈ మధ్య కాలంలో చాలా మంది థైరాయిడ్ తో బాధపడుతున్నారు. సంతానలేమికి ఇది కూడా ఒక కారణం అవుతుంది. సర్వాంగాసనం థైరాయిడ్ గ్లాండ్‌ను ఉత్తేజింపజేసి హార్మోన్ సమతుల్యతను మెరుగుపరుస్తుంది. గర్భధారణ అవకాశాలను పెంచుతుంది.
సేతుబంధాసనం: ఈ ఆసనం ఆడవాళ్ళల పెల్విక్ భాగాన్ని బలంగా తయారుచేస్తుంది. గర్భధారణకు సహాయకారి.
అనులోమ విలోమ ప్రాణాయామం: శ్వాస సాధన ద్వారా చేసే ఈ ఆసనం హార్మోన్ల సమతుల్యత మరియు మానసిక ప్రశాంతత అందిస్తుంది. పురుషులలో స్పెర్మ్ నాణ్యత మెరుగవుతుంది.