సిటీ అలర్ట్ : 14 MMTS రైళ్లు రద్దు

హైదరాబాద్ లో ఫిబ్రవరి 19 మంగళవారం 14 ఎమ్ఎమ్ టీఎస్ రైళ్ల సర్వీసులను రద్దు చేశారు.

  • Publish Date - February 19, 2019 / 02:38 AM IST

హైదరాబాద్ లో ఫిబ్రవరి 19 మంగళవారం 14 ఎమ్ఎమ్ టీఎస్ రైళ్ల సర్వీసులను రద్దు చేశారు.

హైదరాబాద్ : నగరంలో ఫిబ్రవరి 19 మంగళవారం 14 ఎమ్ఎమ్ టీఎస్ రైళ్ల సర్వీసులను రద్దు చేశారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. ఫిబ్రవరి 17 నుంచి ఎమ్ఎమ్ టీఎస్ రైళ్ల సర్వీసులను పాక్షికంగా రద్దు చేస్తున్నారు. ఈనేపథ్యంలోనే మంగళవారం లింగంపల్లి-ఫలక్ నుమా, హైదరాబాద్ ల మధ్య నడిచే రైళ్లను నిలిపివేస్తున్నట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. 

రద్దైన రైళ్లు..
ఎక్కడి నుంచి ఎక్కడి వరకు….  బయలుదేరే వేళలు 
ఫలక్ నుమా – లింగంపల్లి… 11.01, 11.42, 11.57, 12.19
లింగంపల్లి – ఫలక్ నుమా…11.43, 12.19, 12.53, 13,23
హైదరాబాద్ – లింగంపల్లి…11.19, 11.46, 12.32
లింగంపల్లి – హైదరాబాద్…11.25, 12.01, 12.42