పార్టీ మారిన ఎమ్మెల్యేలపై 420 కేసులు నమోదు చేయాలి : భట్టి విక్రమార్క

  • Publish Date - May 1, 2019 / 06:58 AM IST

పార్టీ మారిన ఎమ్మెల్యేలపై 420 కేసులు నమోదు చేయాలని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. పార్టీలు మారిన ఎమ్మెల్యేలను ప్రజలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. పార్టీ ఫిరాయింపుల అంశం సుప్రీంకోర్టులో ఉందన్నారు. పార్టీ ఫిరాయింపుల అంశాన్ని లోక్ పాల్ పరిధిలో చేర్చాలన్నారు.

కేసీఆర్ కు పార్టీ ఫిరాయింపులపై ఉన్న శ్రద్ధ పాలనపై లేదని విమర్శించారు. సీఎల్పీని టీఆర్ఎస్ లో విలీనం చేస్తామని కేసీఆర్, కేటీఆర్ సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్రకు విశేష స్పందన వస్తోందన్నారు.