సంక్రాంతికి 4940 ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ 4940 ప్రత్యేక బస్సులు నడుపనున్నట్లు వెల్లడించారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతుందని తెలిపారు. 

  • Publish Date - December 26, 2019 / 12:09 PM IST

సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ 4940 ప్రత్యేక బస్సులు నడుపనున్నట్లు వెల్లడించారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతుందని తెలిపారు. 

సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ 4940 ప్రత్యేక బస్సులు నడుపనున్నట్లు వెల్లడించారు. గురువారం (డిసెంబర్ 26, 2019) ఎంజీబీఎస్‌లోని రంగారెడ్డి ఆర్‌ఐ కార్యాలయంలో ఆర్టీసీ అధికారులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంక్రాంతి సందర్భంగా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతుందని వెల్లడించారు. 

(జనవరి 10, 2020) తేదీ నుంచి (జనవరి 13, 2020) తేదీ వరకు హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయన్నారు. ఎంజీబీఎస్‌, జూబ్లీ బస్‌స్టేషన్‌ల నుంచి పలు ప్రాంతాలకు బస్సు సర్వీసులు నడుపనున్నట్లు చెప్పారు. ప్రయాణికులు ముందుగా రిజర్వేషన్‌ చేసుకునే సౌకర్యం ఉందని తెలిపారు. ఆర్టీసీలో ప్రయాణించి భద్రంగా ప్రయాణికులు తమ తమ ఇళ్లకు చేరుకుని, సంక్రాంతి పండుగను సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.

ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి పండుగకే కాంకుడా మిగిలిన పండుగులకు కూడా ఆర్టీసీ అదనపు బస్సులను నడుపుతుంది. గ్రామాల నుంచి వచ్చిన వేల సంఖ్యలో ప్రజలు వివిధ పనులు చేస్తూ హైదరాబాద్ లో ఉంటున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి హైదరాబాద్ కు వచ్చిన ప్రజలు సంక్రాంతికి తమ సొంతూళ్లకు పయనమవుతారు. గ్రామాలకు వెళ్తున్న జనంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతాయి.  

ఉద్యోగాలు, కూలీ పనులు చేసుకోవడానికి వచ్చిన జనం, చదువు కోవడానికి వచ్చిన విద్యార్థులు సైతం సొంతూర్లకు పయనమవుతారు. ఈ క్రమంలో పండుగల సందర్భంగా హైదరాబాద్ నగరం సగం వరకు ఖాళీ అవుతుంది. నగరంలోని రోడ్లు, వీధులు నిర్మానుష్యంగా కనిపిస్తాయి. చాలా ట్రాఫిక్ రద్దీ తగ్గుతుంది.