రద్దీ తగ్గించడానికి లింక్‌ రోడ్లు.. 800 బస్‌ షెల్టర్లు : GHMC కమిషనర్

హైదరాబాద్‌లో ప్రయాణికుల సౌకర్యార్థం ఆధునిక డిజైన్లతో కొత్తగా 800 బస్‌ షెల్టర్లు నిర్మిస్తామని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌ తెలిపారు.

  • Publish Date - December 21, 2019 / 02:55 PM IST

హైదరాబాద్‌లో ప్రయాణికుల సౌకర్యార్థం ఆధునిక డిజైన్లతో కొత్తగా 800 బస్‌ షెల్టర్లు నిర్మిస్తామని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌ తెలిపారు.

హైదరాబాద్‌లో ప్రయాణికుల సౌకర్యార్థం ఆధునిక డిజైన్లతో కొత్తగా 800 బస్‌ షెల్టర్లు నిర్మిస్తామని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌ తెలిపారు. శనివారం (డిసెంబర్ 21, 2019) హోటల్‌ టూరిజం ప్లాజాలో నిర్వహించిన నగర సమన్వయ సమావేశంలో కమిషనర్ లోకేష్ మాట్లాడుతూ మెట్రోరైల్‌ సంస్థ తొలగించిన 400 బస్‌షెల్టర్లను అనువైన ప్రదేశాల్లో పునర్నిర్మిస్తామన్నారు. ప్రధాన రోడ్లపై రద్దీని తగ్గించుటకు లింక్‌ రోడ్లను సమాంతర రోడ్లుగా అభివృద్ధి చేస్తామన్నారు. 

పాదాచారుల సౌలభ్యం కోసం ఏప్రిల్‌లోగా 800 కిమీల పుట్‌పాత్‌లు నిర్మిస్తామని చెప్పారు. జేబీఎస్‌ నుంచి ఎంజీబీఎస్‌ వరకు చెత్తను తొలగించాలని కమిషనర్‌ అధికారులను ఆదేశించారు. మెట్రో పిల్లర్ల కింద సాఫీగా వాహనాలు వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో కమిషనర్‌ లోకేశ్‌ కుమార్‌తో పాటు పలు విభాగాల అధికారులు పాల్గొన్నారు.