ప్రయాణికుల రద్దీ దృష్ట్యా 89 అదనపు రైళ్లు

ప్రయాణికుల రద్దీతో వివిధ ప్రాంతాలకు 89 అదనపు రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

  • Publish Date - December 28, 2019 / 03:29 AM IST

ప్రయాణికుల రద్దీతో వివిధ ప్రాంతాలకు 89 అదనపు రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

ప్రయాణికుల రద్దీతో వివిధ ప్రాంతాలకు 89 అదనపు రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. హైదరాబాద్, రామేశ్వరం మధ్య 18 రైళ్లు, హైదరాబాద్, తిరుచిరపల్లి మధ్య 16 రైళ్లు, విల్లుపురం, సికింద్రాబాద్ మధ్య 18 రైళ్లు నడపనుంది. 

అలాగే చెన్నై సెంట్రల్, సికింద్రాబాద్ మధ్య 34 రైళ్లు, సికింద్రాబాద్, చెన్నై సెంట్రల్ మధ్య ఒక సువిధ స్పెషల్ రైలును కూడా నడుపుతున్నట్లు వెల్లడించింది. కేటాయించిన తేదీ, సమయానికి అనుగుణంగా ఈ అదనపు రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణమధ్య రైల్వే తెలిపింది.