ఏపీ, తెలంగాణలో ఏప్రిల్ 11న ఎన్నికలు

  • Publish Date - March 10, 2019 / 12:25 PM IST

7వ లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది ఎన్నికల కమిషన్. మార్చి 10వ తేదీ ఢిల్లీలో ప్రకటించారు చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ అరోరా. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు 2019, ఏప్రిల్ 11వ తేదీ నుంచి మే 19వ తేదీతో ముగుస్తాయి. మే 23వ తేదీ ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ఉంటుంది. ఏపీ, తెలంగాణలో మొదటి విడత ఏప్రిల్ 11వ తేదీనే.. లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఏపీ అసెంబ్లీకి కూడా మొదటి విడతలోనే ఏప్రిల్ 11వ తేదీన పోలింగ్ జరగనుంది.

మొదటి విడత పోలింగ్ జరిగే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ (42), తెలంగాణ (17), అరుణాచల్ ప్రదేశ్ (2), అసోం (5), బీహార్ (4), చత్తీస్ ఘడ్ (1), జమ్మూకాశ్మీర్ (2), మహారాష్ట్ర (7), మణిపూరి(1), మేఘాలయ(2), మిజోరం(1), నాగాలాండ్ (1), ఒరిశా(4), సిక్కిం(1), త్రిపుర (1), ఉత్తరప్రదేశ్ (8), ఉత్తరాఘండ్ (5), వెస్ట్ బెంగాల్ (2), అండమాన్ (1), లక్షదీప్ (1)మొదటి విడత ఏప్రిల్ 11వ తేదీన 91 లోక్ సభ నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది.

ట్రెండింగ్ వార్తలు