తెలంగాణలో మరో 600 అక్రెడిటేషన్‌ కార్డులు

తెలంగాణలో కొత్తగా మరో 600 మంది జర్నలిస్టులకు అక్రెడిటేషన్‌ కార్డులు మంజూరు చేసినట్టు రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ తెలిపారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ కల్పించామని చెప్పారు. 

  • Publish Date - January 31, 2020 / 02:11 AM IST

తెలంగాణలో కొత్తగా మరో 600 మంది జర్నలిస్టులకు అక్రెడిటేషన్‌ కార్డులు మంజూరు చేసినట్టు రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ తెలిపారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ కల్పించామని చెప్పారు. 

తెలంగాణలో కొత్తగా మరో 600 మంది జర్నలిస్టులకు అక్రెడిటేషన్‌ కార్డులు మంజూరు చేసినట్టు రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ తెలిపారు. గురువారం (జనవరి 30, 2020) సమాచారశాఖ కార్యాలయంలో నిర్వహించిన మీడియా అక్రెడిటేషన్‌ కమిటీ మూడో సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఇప్పటివరకు 18 వేల మంది జర్నలిస్టులకు అక్రెడిటేషన్‌ కార్డులు జారీ చేశామన్నారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ కల్పించామని చెప్పారు. 

వెలుగు, ప్రజాపక్షం దినపత్రికల్లో పనిచేసే జర్నలిస్టులకు కూడా అక్రెడిటేషన్లు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో సమాచారశాఖ అదనపు సంచాలకుడు నాగయ్య, మీడియా అకాడమీ కార్యదర్శి విజయ్‌గోపాల్‌, జాయింట్‌ డైరెక్టర్‌ జగన్‌, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ హష్మి, కమిటీ సభ్యులు విరాహత్‌అలీ, బసవపున్నయ్య, కట్టా కవిత, సౌమ్య, వీ సతీశ్‌, కోటిరెడ్డి, ప్రకాశ్‌, గంగాధర్‌, ఆర్టీసీ పీఆర్వో కిరణ్‌కుమార్‌రెడ్డి, సంపత్‌ తదితరులు పాల్గొన్నారు.
 

ట్రెండింగ్ వార్తలు