హైదరాబాద్ లో కరోనా : శంషాబాద్ ఎయిర్ పోర్టులో మరో కరోనా అనుమానితుడు 

హైదరాబాద్ ఎయిర్ పోర్టులో కరోనా కలకం రేపుతోంది. శంషాబాద్ ఎయిర్ పోర్టులో మరో కరోనా అనుమానితుడు వచ్చాడు.

  • Publish Date - March 4, 2020 / 09:16 AM IST

హైదరాబాద్ ఎయిర్ పోర్టులో కరోనా కలకం రేపుతోంది. శంషాబాద్ ఎయిర్ పోర్టులో మరో కరోనా అనుమానితుడు వచ్చాడు.

హైదరాబాద్ ఎయిర్ పోర్టులో కరోనా కలకం రేపుతోంది. శంషాబాద్ ఎయిర్ పోర్టుకు మరో కరోనా అనుమానితుడు వచ్చాడు. బ్రిటీష్ ఎయిర్ వేస్ నుంచి వచ్చిన ప్రయాణికుడికి కరోనా లక్షణాలు ఉండటంతో అతన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇటు హైదరాబాద్ ఐటీ సెక్టార్ లో కరోనా కలకలం నెలకొంది. మైండ్ స్పైస్ లోని ఓ కార్యాలయంలో పని చేస్తున్న ఉద్యోగికి కరోనా పాజిటివ్ లక్షణాలు వచ్చాయి. రెండు వారాల క్రితం ఇటలీ నుంచి తిరిగి వచ్చిన వ్యక్తి కరోనా లక్షణాలు ఉండటంతో కార్యాలయాన్ని యాజమాన్యం మూసివేసింది. ఇంటి నుంచే పనిచేయాలంటూ ఉద్యోగులకు ఈ మెయిల్ చేశారు. మైండ్ స్పేస్ లోని ఇతర కార్యాలయాలను సిబ్బంది ఖాళీ చేయిస్తోంది. మరోవైపు ఉద్యోగులు ఆందోళనలో ఉన్నారు.

కరోనా వైరస్ కేసు నేపథ్యంలో గాంధీ ఆస్పత్రికి అనుమానితుల తాకిడి పెరుగుతోంది. నిన్న 47 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, అందులో 45 మందికి నెగెటివ్‌ అని తేలిందని ఆస్పత్రి డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ఓ ప్రకటన విడుదల చేశారు. మరో ఇద్దరిపై అనుమానం ఉందని, వారి రక్త నమూనాల పరీక్షలను పుణె పంపామని, ఆ ఫలితాలు రావాల్సి ఉందని తెలిపారు. వీరి టెస్టుల రిజల్స్ట్ రేపు వచ్చే అవకాశం ఉంది.(బిగ్ బ్రేకింగ్ : 23మంది ఎంపీలకు కరోనా!!)

కరోనా వైరస్ బారిన పడ్డారని భావిస్తున్న ఈ ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు ఇటలీ నుంచి వచ్చిన వారు కాగా, మరొకరు.. కరోనా పాజిటివ్ కేసుగా గాంధీలో చికిత్స పొందుతున్న సాఫ్ట్‌వేర్ యువకుడికి సన్నిహితుడిగా ఉన్నట్లుగా వైద్యులు గుర్తించారు. అందుకే వీరి రక్త నమూనాలను పుణెకు పంపినట్లుగా వైద్యులు తెలిపారు. మరోవైపు… కరోనా లేదని డిశ్చార్జి చేసిన 45 మందిని జనసంచారానికి దూరంగా హౌస్ ఐసోలేషన్‌లో ఉండాలని సూచించారు.

2020, మార్చి 04వ తేదీ బుధవారం మరో 23మంది కరోనా అనుమానితులు గాంధీ ఆస్పత్రికి వచ్చారు. వీరి రక్తనమూనాలను కూడా సేకరించి పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరోవైపు… కరోనా అనుమానితులు గాంధీకి క్యూ కడుతుండటంతో సాధారణ పేషెంట్ల తాకిడి తగ్గింది. కరోనా అనుమానితుల తాకిడితో గాంధీ ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డు నిండిపోయింది. ఇక్కడి సామర్థ్యానికి మించి కరోనా కేసులు వస్తున్నాయి.

ఐసోలేషన్ వార్డులో 40 పడకలు మాత్రమే ఉండగా… 40గంటల వ్యవధిలో 50మందికిపైగా పరీక్షల కోసం వచ్చారు. దీంతో పడకల కొరత తలెత్తింది. ఇక.. గాంధీలోని ఐసోలేషన్ వార్డులో ఉన్న బెడ్స్‌ కెపాసిటీ ఫుల్ అవడంతో… కొత్తగా వచ్చే కరోనా అనుమానితులను ఫీవర్ ఆస్పత్రికి తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.

See More :

ఇండియాలో కరోనాకు ట్రీట్‌మెంట్ చేసేందుకు సరిపడా డాక్టర్లు లేరట!

హైదరాబాద్ ఐటీ‌సెక్టార్‌లో కరోనా కలకలం : మైండ్‌స్పేస్ ఉద్యోగికి పాజిటివ్ లక్షణాలు