ఐరాస సమ్మిట్ కు ఎంపీ కవితకు ఆహ్వానం

నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితకు మరో అరుదైన గౌరవం దక్కింది.

  • Publish Date - February 16, 2019 / 01:04 PM IST

నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితకు మరో అరుదైన గౌరవం దక్కింది.

హైదరాబాద్ : నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితకు మరో అరుదైన గౌరవం దక్కింది. ఐక్యరాజ్యసమితి సమ్మిట్ లో ఎంపీ కవిత ప్రసంగించనున్నారు. యునైటెడ్ నేషన్స్ గ్లోబల్ కాంపాక్ట్ స్థానిక సంస్థ.. నేషనల్ వర్క్ ఇండియా మార్చి 1న ఢిల్లీలో సమానత్వ సమ్మిట్ నిర్వహించనున్నారు. ఈ సమ్మిట్ లో ప్రసంగించాల్సిందిగా ఎంపీ కవితకు ఆహ్వానం పంపారు. కవిత ఆలోచనలు, ఎస్ డీజీ లక్ష్యాల సాధన కోసం ఆమె చేస్తున్న కృషిని గుర్తించి సమ్మిట్ కు ఎంపిక చేశారు.