గ్రీన్‌ ఛాలెంజ్‌ ను స్వీకరించిన అనసూయ

  • Publish Date - September 14, 2019 / 03:56 PM IST

ఆకుపచ్చ తెలంగాణ కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ హరితహారం తలపెట్టారు. ఈ కార్యక్రమానికి మద్దతుగా ఎంపీ జోగినపల్లి సంతోష్‌ కుమార్‌ గ్రీన్‌ ఛాలెంజ్‌కు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా హైదరాబాద్ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ ఇచ్చిన గ్రీన్‌ ఛాలెంజ్‌ను నటి, యాంకర్‌ అనసుయ స్వీకరించారు. 

కేబీఆర్‌ పార్కు ఎదుట జీహెచ్‌ఎంసీ స్థలంలో అనసూయ మూడు మొక్కలు నాటారు. అనంతరం తన కొడుకుతో పాటు నటుడు అడవి శేషు, దర్శకుడు వంశీ పైడిపల్లి, యాంకర్‌ సుమా కనకాల, ప్రియదర్శిని నామినేట్‌ చేశారు. ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటాల్సిందిగా ఆమె కోరారు. గ్రీన్‌ ఛాలెంజ్‌ను స్వీకరించి, మొక్కలు నాటిన అనసూయను ఎంపీ సంతోష్‌ కుమార్‌ ఈ సందర్భంగా అభినందించారు.