అక్టోబర్ 15 నుంచి ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ

  • Publish Date - September 24, 2019 / 02:55 AM IST

ఆర్మీలో ఉద్యోగం చేయాలని కలలు కనేవారికి శుభవార్త. హైదరాబాద్ సికింద్రాబాద్‌లో (అక్టోబర్ 15, 2019) నుంచి (అక్టోబర్ 25, 2019) వరకు ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ జరుగనుంది. సికింద్రాబాద్ తిరుమలగిరిలోని 125 ఇన్‌ఫాంట్రీ బెటాలియన్ ఈ రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహిస్తోంది. టెర్రిటోరియల్ ఆర్మీలో సోల్జర్ (జనరల్ డ్యూటీ), క్లర్క్, షెఫ్ కమ్యూనిటీ, షెఫ్ స్పెషల్, హెయిర్ డ్రెస్సర్, ఈఆర్ పోస్టులను భర్తీ చేయనుంది.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్నాటక, రాజస్తాన్, గోవా రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాలైన దాదర్ & నగర్ హవేలీ, డామన్ & డయ్యూ, లక్షద్వీప్, పాండిచ్చెరి అభ్యర్థులు ఈ రిక్రూట్‌మెంట్ ర్యాలీలో పాల్గొనవచ్చు. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. సికింద్రాబాద్ సెంటర్‌లో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీలో పాల్గొనాలనుకునే అభ్యర్థులు (అక్టోబర్ 7, 2019) లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 

  • దరఖాస్తుకు చివరి తేదీ : 2019 అక్టోబర్ 7
  • అభ్యర్థుల వయస్సు : 18 నుంచి 42 ఏళ్లు
  • భర్తీ చేయనున్న పోస్టులు : టెర్రిటోరియల్ ఆర్మీలో సోల్జర్ (జనరల్ డ్యూటీ), క్లర్క్, షెఫ్ కమ్యూనిటీ, షెఫ్ స్పెషల్, హెయిర్ డ్రెస్సర్, ఈఆర్
  • విద్యార్హత : సోల్జర్ (జనరల్ డ్యూటీ) పోస్టులకు 10వ తరగతి లేదా తత్సమాన పరీక్ష 45% మార్కులతో పాస్ కావాలి. ప్రతీ సబ్జెక్ట్‌లో 33% మార్కులు తప్పనిసరి. లేదా 12వ తరగతి పాస్ కావాలి. సోల్జర్ ట్రేడ్స్‌మ్యాన్ పోస్టుకు 10వ తరగతి, సోల్జర్ క్లర్క్ పోస్టుకు 60% మార్కులతో 10+2 పాస్ కావాలి. ప్రతీ సబ్జెక్ట్‌లో 50% మార్కులు తప్పనిసరి.