అర్థరాత్రి : ఆర్ట్ డైరెక్టర్ లక్ష్మీ సింధూజాపై దాడి

  • Publish Date - December 3, 2019 / 09:03 AM IST

హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో ఆర్ట్ డైరెక్టర్ లక్ష్మీ సింధూజాపై అర్థరాత్రి సమయంలో కొంతమంది దుండగులు దాడికి పాల్పడ్డారు.  బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లో ఈ ఘటన జరిగింది. గుర్తు తెలియని  కొంతమంది వ్యక్తులు తనతో అసభ్యంగా ప్రవర్తించారనీ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో లక్ష్మీ సింధూజ ఫిర్యాదు చేశారు.

రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న యువతిని కారుతో ఢీకొట్టటంతో సింధూజ కారులో ఉన్న వారిని తనను ఎందుకు ఢీకొట్టారని ప్రశ్నించింది. దీంతో కారు దిగి ఇష్టమొచ్చినట్లుగా నానా దుర్భాషలాడారు. అసభ్యకరంగా ప్రవర్తించారనీ తెలిపింది. 

సింధూజ ఫిర్యాదుతో  కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందుతులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని విచారిస్తున్నారు. లక్ష్మీ సింధూజపై కావాలనే దాడికి దిగారా? దానికి కారణాలేమిటి..ఎందుకోసం దాడికి పాల్పడ్డారు అనే కోణంలో బంజారాహిల్స్ పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.