రిపబ్లిక్ డే : భారతమాతకు మహా హారతి

భారతమాతకు మహా హారతి కార్యక్రమం నిర్వహించేందుకు భారతమాత ఫౌండేషన్ భారీగా ఏర్పాట్లు చేస్తోంది.

  • Publish Date - January 25, 2019 / 06:32 AM IST

భారతమాతకు మహా హారతి కార్యక్రమం నిర్వహించేందుకు భారతమాత ఫౌండేషన్ భారీగా ఏర్పాట్లు చేస్తోంది.

హైదరాబాద్ : గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని భారతమాతకు మహా హారతి కార్యక్రమం నిర్వహించనున్నారు. జనవరి 26న సాయంత్రం హైదరాబాద్ సిటీ నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో భారతమాతకు మహా హారతి కార్యక్రమం నిర్వహించేందుకు భారతమాత ఫౌండేషన్ భారీగా ఏర్పాట్లు చేస్తోంది. 1500 మంది భారతమాత వేషధారణతో పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి మహిళలు, నగరంలోని వివిధ కాలేజీల నుంచి విద్యార్థులు తరలి వస్తారని నిర్వహకులు తెలిపారు. 

రిపబ్లిక్ డేను పురస్కరించుకుని చిన్నారుల్లో జాతీయ భావం, దేశ భద్రత, దేశ ఔన్నత్యం పెంపొందించేందుకే ఈ కార్యక్రమం చేపట్టినట్లు చెబుతున్నారు నిర్వహకులు. హైదరాబాద్ సిటీలోని ప్రజలు అందరూ పాల్గొని.. భరతమాతకు జేజేలు పలకాలని కోరారు. మహిళలు కూడా తరలిరావాలని కోరారు. దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ భరతమాత ముద్దుబిడ్డలే అనే నినాదం ఇవ్వనున్నారు. భిన్న సంస్కృతులు, మతాలతో నిర్మాణం అయిన దేశం అని కీర్తించారు. ప్రపంచంలోని ఏ దేశంలోనూ ఇన్ని భిన్న సంస్కృతులు లేవంటున్నారు నిర్వాహకులు.