తెలంగాణ వెల్ఫేర్ స్కూల్స్ లో బయోగ్యాస్ ప్లాంట్లు

  • Publish Date - August 27, 2019 / 07:35 AM IST

రాష్ట్రంలోని గిరిజన సంక్షేమ పాఠశాలల్లో బయోగ్యాస్ ప్లాంట్లు ఉపయోగించనున్నారు. స్కూల్ ఆవరణలోనే వీటిని ఏర్పాటు చేయనున్నారు. విద్యార్దులకు మధ్యాహ్న భోజనం వండేందుకు బయోగ్యాస్ ప్లాంట్లను వినియోగించనున్నారు. తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (TSCOST) సహకారంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు.  దీంట్లో భాగంగా కిచెన్..వ్యర్థాలతో పనిచేసే బయోగ్యాస్ ప్లాంట్ల నుండి వెలువడిన వ్యర్థాలను స్కూల్లో పెంచుతున్న మొక్కలకు, చెట్లకు ఎరువులుగా వేసేందుకు ఉపయోగపడుతుంది. 

స్కూల్స్ లో ప్రతీరోజూ..75 కిలోల గ్రీనరీ వేస్టేజ్ (ఆకుపచ్చ వ్యర్థాలు) ఉంటాయనీ..అంటే మధ్యాహ్నం భోజనం వండేందుకు కోసి కూరగాయల వ్యవర్థాలతో పాటు ఇంకా ఇతర వేస్టేజ్ ను బైట పారవేసేందుకు వాటిని తరలించటం కూడా పెద్ద పనిగా మారింది. దీంతో బయోగ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తే..కిచెన్ వేస్టేజ్ ను తరలించే పని ఉండదు సరికదా..వాటితోనే వంట చేసేయవచ్చు. ఇది రెండు విధాలుగా ఉపయోగపడనుంది. 

చెత్త తరలింపు పని లేకుండా..TSCOST బయోగ్యాస్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి ప్లాంటుకు రూ .8 లక్షలు ఖర్చవుతుంది. వీటిలో రూ .4 లక్షలు కేంద్రం స్పాన్సర్ చేస్తుండగా..మిగిలిన ఖర్చు ఆయా స్కూల్స్ గానీ లేదా ఇతర  సంస్థలు భరిస్తున్నాయని TSCOST కార్యదర్శి రవి కుమార్ తెలిపారు.

రోజుకు 75 కిలోల కిచెన్ వేస్టేజ్ తో 14 కిలోల కెపాసిటీ గల రెండు సిలిండర్ల కంటే ఎక్కువగా ఉత్పత్తి అవుతాయని భావిస్తున్నారు. బై-ప్రొడక్ట్స్ అంటే దాంట్లోంచి వచ్చిన వేస్టేజ్ తో కూరగాయలను పండించడం..వంటివాటిని వినియోగించవచ్చు. ఇలా ప్రతీ స్కూల్ రూ .30,000 ఆదా చేసుకోవచ్చు. 

ఇప్పటికే, హైదరాబాద్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, వరంగల్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మరియు హైదరాబాద్ లోని సిసిఎంబిలలో ఇటువంటి ప్లాంట్లను ఏర్పాటు చేసామని TSCOST ప్రాజెక్ట్ అధికారి నగేష్ తెలిపారు.

సేంద్రీయ వ్యర్థ పదార్థాలను తిరిగి వాడుకోవటం..వాటినుంచి వచ్చిన వ్యర్థాలను కూడా ఉపయోగించుకోవటంతో పరిశుభ్రతను కూడా పెంపొందించుకోవచ్చని తెలిపారు. అంతేకాదు..వ్యర్థాలను ఎలా ఉపయోగించుకోవాలనే విషయంపై  విద్యార్థులు అవగాహనకు ఉపయోగపడుతుందరనీ..రీసైకిల్ పట్ల విద్యార్థుల్లో అవగాహన పెరుగుతుందనీ అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే కొన్ని స్కూల్స్ లో అధికారులు  బయోగ్యాస్ ప్లాంట్లను త్వరలోనే ఏర్పాటు చేయనున్నారు.