సైబరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్ పై హత్య కేసు నమోదు చేయాలంటూ ఓ వ్యక్తి రిక్వెస్ట్ చేశాడు. ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఈ ఘటన నమోదైంది. దిశ నిందితులను ఎన్‌కౌంటర్లో చంపేశారంటూ ఆ వ్యక్తి ఆరోపించాడు.
‘నేను సైతం’ ఎన్జీవో చేసిన ఫిర్యాదు మేర రాచకొండ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. ఆరోపణల్లో నిందితులు పాయింట్ బ్లాక్ రేంజ్‌లో కాల్చి చంపారని పేర్కొన్నాడు.
దిశ హత్య కేసులో కీలకాంశాలు:
* దిశ హత్యాచార నిందితులను పోలీసులు 2019, డిసెంబర్ 06వ తేదీ శుక్రవారం తెల్లవారు జామున ఎన్‌కౌంటర్ చేశారు.
* షాద్‌నగర్ సమీపంలోని చటాన్‌పల్లి దగ్గర క్రైమ్ సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తుండగా నిందితులు పారిపోవడానికి ప్రయత్నం చేశారు.
* నలుగురు నిందితులను పోలీసులు కాల్చి చంపారు.
* 2019, నవంబర్ 27వ తేదీన దిశపై నలుగురు నిందితులు అత్యాచారం చేశారు.
* అనంతరం మృతదేహాన్ని చటాన్‌పల్లి బ్రిడ్జి దగ్గర కాల్చివేశారు.
* ఆరీఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్న కేశవులుగా గుర్తించారు.
* దిశ కేసులో నిందితులను గురువారం 2019, డిసెంబర్ 5వ తేదీన పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.