అరుదైన అవకాశం : బుద్ధుడి అవశేషాల దర్శన భాగ్యం

  • Publish Date - January 13, 2019 / 08:08 AM IST

హైదరాబాద్: నగర వాసులకు అరుదైన అవకాశం దక్కింది. గౌతమ బుద్ధుడి అవశేషాల దర్శన భాగ్యం లభించింది. థాయ్‌లాండ్‌ నుంచి తెచ్చిన బుద్ధుడి అవశేషాలను హుస్సేన్‌సాగర్‌లోని బుద్ధ విగ్రహం వద్ద ప్రజల సందర్శనార్థం ఉంచారు. దేశ, విదేశాల నుంచి వచ్చిన 150మంది బౌద్ధులు ఈ ధాతువులను దర్శించుకున్నారు. మాదాపూర్‌ మహేంద్రహిల్స్‌లోని మహాబోధి బుద్ధ విహార కేంద్రంలో భారీ స్తూపాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మహాబోధి సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అమెరికాకు చెందిన ప్రముఖ బౌద్ధ బిక్షువు బిక్కు బోధితో పాటు, శ్రీలంక నుంచి పెద్ద సంఖ్యలో బౌద్ధ బిక్షువులు పాల్గొన్నారు. అనంతరం లుంబినీ పార్కు నుంచి మహేంద్ర హిల్స్‌ వరకు ఊరేగింపుగా తీసుకెళ్లారు.

ట్రెండింగ్ వార్తలు