BookMyShow సైటుపై కేసు వేసిన లాయరు

  • Publish Date - February 27, 2019 / 02:34 AM IST

ప్రముఖ ఆన్ లైన్ సినిమా టిక్కెట్ల విక్రయ్ సైటు “BookMyShow” పై కేసు నమోదైంది. చట్టప్రకారం నిబంధలను పాటించలేదనే కారణంతో జీఎల్‌ నరసింహరావు అనే లాయరు పోలీసులకు ఫిర్యాదు చేయగా బిగ్‌ట్రీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ నిర్వహిస్తున్న బుక్‌ మైషో సైటు నిర్వాహకులపై  హైదరాబాద్‌ సెంట్రల్‌ క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.  తెలంగాణ సినిమా నియంత్రణ చట్టం ప్రకారం ఒక్కో టికెట్‌కు సేవా రుసుం ఆరు రూపాయలు వసూలు చేయాల్సి ఉండగా.. రూ.17 వసూలు చేస్తున్నారని, ఇందుకు బాధ్యులైన బుక్‌ మైషో సీఈవో, ఎండీ ఆశిష్‌ హేమ్‌రాజ్‌, ప్రతినిధి రాజేష్‌ బాల్‌పై చర్యలు తీసుకోవాలంటూ న్యాయవాది జీఎల్‌ నరసింహరావు కేసు పెట్టగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.