హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మపై గోపి అనే వ్యక్తి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు మార్ఫింగ్ ఫోటోపై గోపి పోలీసులకు కంప్లయింట్ ఇచ్చారు. చంద్రబాబు.. జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతున్నట్టు.. వర్మ మార్ఫింగ్ ఫోటో చేశారని, దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని గోపీ చెప్పారు. చంద్రబాబు ఫోటోని మార్ఫింగ్ చెయ్యడం పట్ల గోపి అభ్యంతరం తెలిపారు. వర్మ తీరు తనను ఆవేదనకు గురి చేసిందన్నారు. తాను కలత చెందానని చెప్పారు. వర్మపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను డిమాండ్ చేశారు.
Read Also : ఫేస్ బుక్ LIVE అద్భుత ప్రయోగం : దేశంలోనే ఫస్ట్ టైం అంబులెన్స్ కు 600 కిలోమీటర్ల ట్రాఫిక్ క్లియరెన్స్
వర్మకి అంత ఇంట్రస్ట్ ఉంటే రాజకీయాల్లోకి రావాలని, ఏదో ఒక పార్టీలో చేరాలని గోపి అన్నారు. పార్టీలో చేరాక ఆ పార్టీ తరుఫున వకాల్తా పుచ్చుకుని మాట్లాడొచ్చన్నారు. అలా కాకుండా ఎక్కడో ముంబైలో కూర్చుని, టీవీలలో కూర్చుని ఈ విధంగా నాయకులను అన్ పాపులర్ చెయ్యడం కరెక్ట్ కాదన్నారు. చంద్రబాబు అభిమానిగా, పార్టీ కార్యకర్తగా వర్మ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు.
టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీలో జాయిన్ అయినట్లు, చంద్రబాబు మెడలో వైఎస్ జగన్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానిస్తున్నట్లు ఓ మార్ఫింగ్ ఫోటోను వర్మ తన ట్విట్టర్ లో షేర్ చేశారు. ‘సీబీఎన్ ఇప్పుడే వైసీపీలో చేరారు’ అంటూ కామెంట్ పెట్టారు. ఆర్జీవీ చేసిన ట్వీట్ కలకలం రేపింది. ఈ ఫొటో టీడీపీ, చంద్రబాబు అభిమానులకు కోపం తెప్పించింది. వర్మపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుని అవమానపరిచేలా సోషల్ మీడియాలో వర్మ పోస్టు పెట్టారని టీడీపీ కార్యకర్తలు ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇకపై ఇలాంటి పోస్టులు ఎవరూ పెట్టకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వర్మ లాంటి వారు పెట్టే పోస్టులను ఎక్కువ మంది తెలుసుకుంటూ ఉంటారని, వర్మ ఎంతో బాధ్యతగా పోస్టులు పెట్టాలని సూచించారు. ఇలా అసత్య ప్రచారాలు, మార్ఫింగ్ ఫొటోలను పెట్టి కామెడీ చేయడం కరెక్ట్ కాదన్నారు.
Read Also : ఇక పోదాం పదండీ : చంద్రుడిపై నీళ్లు ఉన్నాయి