చెన్నై షాపింగ్ మాల్ సీజ్

హైదరాబాద్‌లోని మెహిదీపట్నం సర్కిల్‌లో చెన్నై షాపింగ్ మాల్ తోపాటు పలు వ్యాపార సంస్థలపై జీహెచ్ఎంసీ అధికారులు కొరడా ఝలిపించారు.

  • Publish Date - October 30, 2019 / 04:31 AM IST

హైదరాబాద్‌లోని మెహిదీపట్నం సర్కిల్‌లో చెన్నై షాపింగ్ మాల్ తోపాటు పలు వ్యాపార సంస్థలపై జీహెచ్ఎంసీ అధికారులు కొరడా ఝలిపించారు.

హైదరాబాద్‌లోని మెహిదీపట్నం సర్కిల్‌లో చెన్నై షాపింగ్ మాల్ తోపాటు పలు వ్యాపార సంస్థలపై జీహెచ్ఎంసీ అధికారులు కొరడా ఝలిపించారు. ట్రేడ్ లైసెన్స్ లేకుండా, పార్కింగ్ సౌకర్యం లేకుండా, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడుతున్న దుకాణాలు, వ్యాపార సంస్థల్లో దాడులు చేసి వాటిని సీజ్ చేశారు. ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ ముషారఫ్ అలీ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు.

ట్రేడ్ లైసెన్స్ లేకుండా మెహిదీపట్నంలో నిర్వహిస్తున్న చెన్నై సిల్క్స్, విజయ నగర్ కాలనీ సమీపంలోని ఎంఎండీసీ దగ్గర ఉన్న సూపర్ మార్కెట్‌ను సీజ్ చేశారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను ఉపయోగిస్తున్న మెహిదీపట్నంలోని ఆర్‌ఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్‌ను కూడా సీజ్ చేశారు. మహావీర్ ఆస్పత్రి ఎదురుగా ఉన్న మోర్ సూపర్ మార్కెట్‌కు పార్కింగ్ లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన అధికారులు.. రూ.25 వేల జరిమానా విధించారు.