కరోనా భయం లేదులే: హైదరాబాద్‌లో చికెన్, ఎగ్ మేళా

  • Publish Date - February 28, 2020 / 05:49 AM IST

ప్రపంచాన్ని వణికిస్తున్న ప్రమాదకరమైన వ్యాధి కరోనా వైరస్‌. ఈ వ్యాధి పై ప్రజల్లో చాలారకాల భ్రమలు కలుగుతున్నాయి. అవేంటంటే.. చికెన్, గుడ్లు తినడం వల్ల కరోనా వైరస్ వస్తోందని అందరూ భ్రమపడుతున్నారు. అయితే అదంతా నిజం కాదని.. చికెన్, గుడ్లు తినడం వలన కరోనా వైరస్ రాదని తెలంగాణ పౌల్ట్రీ అసోసియేషన్ నాయకులు తెలిపారు. 

ప్రజల్లో ఉన్న ఈ అపోహను తొలగించేందుకు శుక్రవారం (ఫిబ్రవరి 28, 2020) సాయంత్ర 4 గంటల నుంచి నెక్లేస్‌ రోడ్డులోని పీపుల్స్ ఫ్లాజా దగ్గర ఉచిత చికెన్, ఎగ్ మేళాతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. అంతేకాదు ఈ కార్యక్రమానికి పలువురు ప్రజా ప్రతినిధులు కూడా హాజరవుతారని తెలంగాణ పౌల్ట్రీ అసోషియేషన్ సభ్యుడు రాంరెడ్డి తెలిపారు. 

Also Read | వైరస్ రూటు మార్చింది.. కుక్కకు సోకిన కరోనా!
 
తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్‌, తెలంగాణ పౌల్ట్రీ బీడర్స్‌ అసోసియేషన్‌ (TPBA), నేషనల్‌ ఎగ్‌ కోఆర్డినేషన్‌ కమిటీతో పాటు ఇతర ప్రైవేటు కంపెనీలు సంయుక్తంగా చికెన్‌, ఎగ్‌ మేళాను నిర్వహిస్తున్నాయి. ఎర్రమంజిల్‌ లో పౌల్ట్రీ సమాఖ్య, నెక్‌ సమావేశం నేడు జరిగింది.

ఇందులో భాగంగా చికెన్‌, ఎగ్‌ మేళాను నిర్వహిస్తున్నారు. ఈ మేళాలో మంత్రులు కేటీఆర్‌, ఈటల రాజేందర్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, శ్రీనివాస్‌ గౌడ్‌, నిరంజన్‌రెడ్డి పాల్గొననున్నట్లు నిర్వాహ‌కులు తెలిపారు. ఈ మేళకు ప్రతీఒక్కరు వచ్చి అనుమానాలు తొలిగించుకోవాలని సూచించారు.