గర్వం వద్దు.. అధికారం శాశ్వతం కాదు

హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఫలితంపై సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ కంచుకోట హుజూర్ నగర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ గెలుపుపై సీఎం

  • Publish Date - October 24, 2019 / 11:16 AM IST

హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఫలితంపై సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ కంచుకోట హుజూర్ నగర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ గెలుపుపై సీఎం

హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఫలితంపై సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ కంచుకోట హుజూర్ నగర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ గెలుపుపై సీఎం ఆనందం వ్యక్తం చేశారు. హుజూర్ నగర్ ప్రజలు తెలివిగా ఓట్లు వేశారని చెప్పారు. ఈ విజయం ప్రభుత్వానికి టానిక్ లాంటిదన్నారు. మరింత ఉత్సాహంగా పని చేస్తామన్నారు. ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేసినా.. వ్యక్తిగతంగా విమర్శలు చేసినా ప్రజలు నమ్మలేదన్నారు.

రాజకీయ లబ్ది కోసం విపక్షాలు అసత్య ప్రచారం చేశాయని ఆరోపించిన కేసీఆర్.. ప్రజలు వారికి తగిన గుణపాఠం చెప్పారని అన్నారు. కేసీఆర్ ను తిడితే ఓట్లు పడతాయనుకుంటే భ్రమే అన్నారు. హుజూర్ నగర్ లో తన సభ జరక్కపోయినా అద్భుతమైన మెజార్టీ ఇవ్వడం హ్యాపీగా ఉందన్నారు.

తెలంగాణ తెచ్చిన పార్టీగా మాపై చాలా బాధ్యతలు ఉన్నాయని కేసీఆర్ చెప్పారు. అదే సమయంలో పార్టీ శ్రేణులకు ఆయన కీలక సూచన చేశారు. ఈ విజయంతో టీఆర్ఎస్ కార్యకర్తలు గర్వపడకూడదన్నారు. అహంభావం, అహంకారాలు మంచివి కావన్నారు. అధికారం శాశ్వతం కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. కేసీఆర్ ను తిడితే పెద్దవాళ్లం అవుతామని అనుకోవడం భ్రమే అని విపక్ష నేతలను ఉద్దేశించి అన్నారు.

పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన బీజేపీకి.. కనీసం డిపాజిట్ కూడా దక్కలేదన్నారు. తెలంగాణలో ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి సాగునీరు అందిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. త్వరలోనే రెవెన్యూ చట్టం తీసుకొస్తామని… గ్రామ పంచాయతీలకు ప్రతి నెల రూ.339 కోట్లు విడుదల చేస్తామని వెల్లడించారు.