తెలంగాణ జర్నలిస్టులకు గుడ్ న్యూస్: సంవత్సరంలోగా ఇళ్ల స్థలాలు

హుజూర్ నగర్ నియోజకవర్గంలో తమ పార్టీ విజయం సాధించిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ మాట్లాడారు. విజయం గురించి ప్రసంగించిన ఆయన ఆర్టీసీ కార్మికుల సమ్మెపైనా స్పందించారు. ఆ తర్వాత తెలంగాణ జర్నలిస్టుల ఇళ్ల స్థలాల గురించి మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. 

ఓ సంవత్సర కాలంలోగా ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పారు. అంతేగాక, ఇళ్లు కట్టుకునేందుకు కూడా సహకారం అందిస్తామన్నారు. ముందుగా పదవీకాలం ముగిసే లోపే ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తానని చెప్పిన సీఎంకు పది సంవత్సరాల వరకూ మీరే ముఖ్యమంత్రని చెప్పారని జర్నలిస్టు గుర్తు చేశాడు. 

దానికి నవ్వుతూ స్పందించిన ముఖ్యమంత్రి సంవత్సరంలోగా ఇళ్ల స్థలాలు ఇస్తామని దాంతో పాటు నిర్మాణాల కోసం నిధులు కూడా కేటాయిస్తానని తనకు ఆ దమ్ము ఉందని చెప్పారు. జర్నలిస్టు సంక్షేమ నిధి సద్వినియోగం అవుతుందని, తర్వాతి బడ్జెట్ లోనూ సంక్షేమానికి రూ.100కోట్లు కేటాయించే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు.