విధుల్లోకి వస్తేనే ఉద్యోగాలు : ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్ మరో అవకాశం

కార్మిక సంఘాలు కదం తొక్కాయి. ప్రభుత్వం కన్నెర్ర చేసింది. ఎవరూ వెనక్కి తగ్గలేదు. సమ్మె ప్రభావంతో ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. కొన్ని చోట్ల ప్రత్యామ్నాయ

  • Publish Date - October 6, 2019 / 01:39 AM IST

కార్మిక సంఘాలు కదం తొక్కాయి. ప్రభుత్వం కన్నెర్ర చేసింది. ఎవరూ వెనక్కి తగ్గలేదు. సమ్మె ప్రభావంతో ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. కొన్ని చోట్ల ప్రత్యామ్నాయ

కార్మిక సంఘాలు కదం తొక్కాయి. ప్రభుత్వం కన్నెర్ర చేసింది. ఎవరూ వెనక్కి తగ్గలేదు. సమ్మె ప్రభావంతో ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. కొన్ని చోట్ల ప్రత్యామ్నాయ మార్గాలతో నడిచినా.. సరిపడా బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు ఇక్కట్లు పడ్డారు. ఆర్టీసీ కార్మిక సంఘాల సమ్మె.. పొలిటికల్‌ హీట్‌కు కారణమైంది. ప్రభుత్వాన్ని విమర్శించేందుకు ప్రతిపక్షాలకు ఆయుధంగా మారింది. ఇటు ప్రభుత్వం మాత్రం అసలు వెనక్కి తగ్గలేదు. సమ్మె విమరమించకుంటే జరిగే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది.

పండుగ పూట ఆర్టీసీ సమ్మె.. తీవ్ర దుమారాన్ని రేపింది. ప్రభుత్వ హెచ్చరికలు, అల్టిమేటం.. కార్మిక సంఘాల నాయకుల కౌంటర్లతో వాతావరణం వేడెక్కింది. పొలిటికల్‌ కారిడార్‌లోనూ హీట్‌ను పెంచింది. కార్మికుల పక్షాన విపక్షాలు నిలిస్తే.. జనం ఇబ్బందులను ప్రస్తావిస్తూ ప్రభుత్వం కౌంటర్‌ ఇచ్చింది. ఉదయం నుంచి ఇబ్బందులు పడ్డ ప్రయాణికులను గమ్య స్థానాలకు చేర్చేందుకు ప్రభుత్వం కొన్ని ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంది. టెంపరరీ డ్రైవర్లతో కొన్ని బస్సులను నడిపించగలిగింది. రాష్ట్రవ్యాప్తంగా 9వేల బస్సులను నడిపింది. అయితే పూర్తిగా సేవలను పునరుద్ధరించలేకపోయింది. 

కార్మికుల తీరుతో ఆగ్రహం చెందిన ప్రభుత్వం.. ప్రజల అవస్థలను గమనించాలని కోరింది. సాయంత్రం 6 గంటలలోగా విధుల్లో చేరితేనే ఉద్యోగులుగా ఉంటారని లేదంటే.. వారి స్థానాల్లో కొత్తవారిని తీసుకుంటామంటూ ప్రకటించింది. ఇకపై చర్చలుండవని యాక్షన్‌ మాత్రమే ఉంటుందని హెచ్చరించింది. సర్కార్‌ కన్నెర్ర చేసినా కార్మికులు మాత్రం వెనక్కి తగ్గలేదు. ఉద్యోగాలు పోతాయని హెచ్చరించినా భయపడలేదు. సమ్మెను యథాతథంగా కొనసాగించారు. కార్మిక సంఘాల నాయకులు కూడా ప్రభుత్వానికి ఘాటుగానే జవాబు చెప్పారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ కూడా ఆర్టీసీ ఉద్యోగుల తీరును తప్పుబట్టారు. దేశంలోనే అత్యధిక జీతం తీసుకుంటూ.. ప్రజలకు సేవలందించాల్సిన సమయంలో సమ్మెకు దిగడం సరికాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రతిపక్షాలు మాత్రం ప్రభుత్వ తీరును ఎండగట్టాయి. ఆర్టీసీ సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలిపాయి. ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డాయి. ఇక ఆందోళన చేస్తున్న కార్మికులను స్వయంగా కలిసి మద్దతు తెలిపారు జనసమితి అధ్యక్షుడు కోదండరామ్‌. ఇటు హుజూర్‌నగర్‌లో అధికార పార్టీకి మద్దతు ఇస్తున్న సీపీఐ నేత చాడ వెంకట్‌రెడ్డి కూడా కార్మికుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని అన్నారు. పొలిటికల్‌ హీట్‌ ఇలా ఉంటే.. సమ్మెను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటోంది. ఇక ముందుగా శనివారం సాయంత్రం ఆరుగంటల వరకే డెడ్‌లైన్‌ విధించిన ప్రభుత్వం.. మరోసారి ఆదివారం ఉదయం వరకు సమయమిచ్చింది. ఆదివారం మధ్యాహ్నం ఉన్నతస్థాయి సమావేశం అనంతరం తుది నిర్ణయం తీసుకోనుంది.

Also Read : చంచల్ గూడ జైలుకు రవి ప్రకాష్ : 14 రోజుల రిమాండ్