మాకు నీతులు చెపొద్దు : నలుగురు ఎంపీలను బీజేపీ విలీనం చేసుకుంది

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో సీఎం కేసీఆర్ కాంగ్రెస్ పై ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ నేతల తీరుని ఖండించారు. ఎమ్మెల్యేల అనర్హత అంశంలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్

  • Publish Date - September 22, 2019 / 06:52 AM IST

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో సీఎం కేసీఆర్ కాంగ్రెస్ పై ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ నేతల తీరుని ఖండించారు. ఎమ్మెల్యేల అనర్హత అంశంలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో సీఎం కేసీఆర్ కాంగ్రెస్ పై ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ నేతల తీరుని ఖండించారు. ఎమ్మెల్యేల అనర్హత అంశంలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేతలు మాకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను స్పీకర్ పట్టించుకోలేదని కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలకు సీఎం కౌంటర్ ఇచ్చారు. మీరిచ్చింది గాలి పిటిషన్లు కాబట్టే స్పీకర్ పట్టించుకోలేదన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరూ టీఆర్ఎస్ లో చేరలేదు అన్న సీఎం… కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో విలీనం అయ్యారని చెప్పారు. రాజ్యాంగబద్దంగానే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో విలీనం అయ్యారని వివరించారు.

బీజేపీపైనా సీఎం కేసీఆర్ విమర్శలు చేశారు. కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందే అన్నారు. ఏపీలో నలుగురు రాజ్యసభ సభ్యులను బీజేపీ విలీనం చేసుకుందని సభలో సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. గోవా, రాజస్థాన్ లోనూ ఇతర పార్టీ ఎమ్మెల్యేను బీజేపీ కలుపుకుందన్నారు. కాంగ్రెస్ నేతలు అర్థం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వాల పాలన కంటే టీఆర్ఎస్ పాలన ఎన్నో రెట్లు బాగుందని ప్రజలు అంటున్నారని సీఎం చెప్పారు. ఎవరు ఏం చేశారో ప్రజలకు తెలుసు అన్నారు. మాకు ప్రజలపై నమ్మకం ఉందన్న కేసీఆర్.. అందుకే ముందస్తు ఎన్నికలకు వెళ్లి గెలిచామన్నారు.