తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో సీఎం కేసీఆర్ ప్రతిపక్షాలపై ఫైర్ అయ్యారు. ద్రవ్య వినిమయ బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరిగింది. సీఎం కేసీఆర్ కాంగ్రెస్, బీజేపీపై ఓ రేంజ్ లో
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో సీఎం కేసీఆర్ ప్రతిపక్షాలపై ఫైర్ అయ్యారు. ద్రవ్య వినిమయ బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరిగింది. సీఎం కేసీఆర్ కాంగ్రెస్, బీజేపీపై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. దేశంలో పేదరికానికి కాంగ్రెస్, బీజేపీనే కారణం అని ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీ వల్లే దేశ ఆర్థిక వ్యవస్థ నాశనమైందన్నారు. 51 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఇంటికో ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదని కేసీఆర్ ప్రశ్నించారు. 51 ఏళ్లు పరిపాలించిన కాంగ్రెస్ ఏం సాధించిందని అడిగారు. కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో తెలంగాణకు ఒక్కరూపాయి కూడా ఇవ్వను అన్నారని.. అప్పుడు కాంగ్రెస్ వాళ్లు ఏమీ అనలేదని కేసీఆర్ గుర్తు చేశారు.
దేశంలో దుర్మార్గపు పరిపాలన చేసింది మీరు కాదా అని కాంగ్రెస్ పై మండిపడ్డారు. కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఎందుకు ఏర్పాటు చెయ్యలేదన్నారు. రాష్ట్రాల హక్కులను కాంగ్రెస్ హరించిందన్నారు. పథకాల పేర్లు మార్చారు తప్ప.. దేశ ప్రజల తలరాతలు మార్చలేదన్నారు. రైతు ఆత్మహత్యలు కూడా కాంగ్రెస్ పాపమే అన్నారు. ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడేది ప్రాంతీయ పార్టీలే అని కేసీఆర్ స్పష్టం చేశారు. పదవులను చిత్తు కాగితాల్లా వదిలేసి తెలంగాణ తెచ్చామన్న సీఎం కేసీఆర్.. రాష్ట్ర అభివృద్ధి కోసం ఇంకా అప్పులు తెస్తామన్నారు.