ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ రివ్యూ నిర్వహించారు. సుదీర్ఘంగా సాగిన ఈ సమీక్షలో… హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా చర్చలకు ముందుడుగు వేశారు. కార్మిక సంఘాలతో ఎవరు
ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ రివ్యూ నిర్వహించారు. సుదీర్ఘంగా సాగిన ఈ సమీక్షలో… హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా చర్చలకు ముందుడుగు వేశారు. కార్మిక సంఘాలతో ఎవరు చర్చలు జరపాలన్న దానిపై ఓ క్లారిటీకి వచ్చిన ప్రభుత్వం… ఆర్టీసీ ఎండీగా ఎవర్ని నియమించాలన్న దానిపైనా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ కేసీఆర్ తాజా రివ్యూలో తీసుకున్న తాజా నిర్ణయాలేంటి?
ఆర్టీసీ స్ట్రైక్ కంటిన్యూ అవుతోంది. 13వ రోజు కూడా సమ్మె కొనసాగుతోంది. ఓ వైపు కార్మికులకు మద్దతు పెరుగుతోంది. మరోవైపు…చర్చలకు హైకోర్టు ఇచ్చిన గడువు ముగియబోతోంది… ఇలాంటి తరుణంలో ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ రివ్యూ జరిపారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, రవాణాశాఖ కార్యదర్శి సునీల్ శర్మతోపాటు మరికొందరు అధికారులతో నిన్న రాత్రి సుదీర్ఘంగా చర్చించిన సీఎం… మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ సమీక్షలో ఆర్టీసీ సమ్మె, హైకోర్టు ఆదేశాలు, తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని.. సమ్మె విరమింపజేయాలని, ఆర్టీసీకి పూర్తి స్థాయి ఎండీని నియమించాలని కోర్టు ఆదేశించిన నేపథ్యంలో… పలువురి పేర్లను పరిశీలించినట్లు సమాచారం. ఐపీఎస్ అధికారులు అకున్ సబర్వాల్, స్టీఫెన్ రవీంద్ర, ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్, శివధర్‌రెడ్డి పేర్లను పరిశీలించిన సీఎం… ఆర్టీసీ ఎండీ నియామకంపై ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. శుక్రవారం(అక్టోబర్ 18,2019) కొత్త ఎండీ నియామకానికి సంబంధించిన ఉత్తర్వులు జారీచేసే అవకాశం ఉంది.
సమ్మె కొనసాగుతున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపైనా సమీక్షించిన సీఎం… కొత్త ఎండీ ఆధ్వర్యంలో చర్చలు జరపాలా.. లేదంటే… మంత్రుల కమిటీ ఏర్పాటు చేసి చర్చలు నిర్వహించాలా అన్నదానిపై చర్చించినట్లు తెలుస్తోంది. చివరికి మంత్రుల కమిటీకే ప్రభుత్వం మొగ్గుచూపినట్లు సమాచారం. దీనికి హైకోర్టు ఒప్పుకుంటే చర్చలకు సంసిద్ధత వ్యక్తంచేయాలని అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు.. బస్సులను నూటికి నూరు శాతం తిప్పేలా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు.