కేసీఆర్ వ్యూహం : CM కేటీఆర్‌.. గజ్వేల్‌ నుంచి కవితకు చాన్స్‌..!

తెలంగాణలోని ఆ పార్టీ పెద్దాయన దేశ రాజకీయాల్లోకి వెళ్లి పోదామనుకుంటున్నారు. పెద్దల సభలో ప్రవేశించి పెద్దరికాన్ని చాటుకోవాలనుకుంటున్నారు. తన కుమారుడిని ఇక్కడ

  • Publish Date - January 31, 2020 / 10:32 AM IST

తెలంగాణలోని ఆ పార్టీ పెద్దాయన దేశ రాజకీయాల్లోకి వెళ్లి పోదామనుకుంటున్నారు. పెద్దల సభలో ప్రవేశించి పెద్దరికాన్ని చాటుకోవాలనుకుంటున్నారు. తన కుమారుడిని ఇక్కడ

తెలంగాణలోని ఆ పార్టీ పెద్దాయన దేశ రాజకీయాల్లోకి వెళ్లి పోదామనుకుంటున్నారు. పెద్దల సభలో ప్రవేశించి పెద్దరికాన్ని చాటుకోవాలనుకుంటున్నారు. తన కుమారుడిని ఇక్కడ రాష్ట్రంలో ప్రభుత్వ పగ్గాలు అప్పగించేద్దామనే ఆలోచనలో ఉన్నారు. తాను పెద్దల సభకు వెళ్లిపోతే ఖాళీ అయ్యే అసెంబ్లీ స్థానం నుంచి ఎంపీ ఎన్నికల్లో ఓడిన తన కుమార్తెను రంగంలోకి దించాలన్న వ్యూహం సిద్ధం చేసుకున్నారు. ఎప్పటి నుంచో వినిపిస్తున్న కుమారుడి పట్టాభిషేక ఘట్టానికి ఇంకెంత కాలం పడుతుంది? అనుకున్న ప్లాన్‌ పక్కగా వర్కవుట్‌ అవుతుందా?

కేటీఆర్‌ ముఖ్యమంత్రి అయితే కేసీఆర్‌ ఏం చేస్తారు?
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇక జాతీయ రాజకీయాల్లోకి వెళ్లిపోతారనే టాక్‌ రాష్ట్రంలో జోరుగా వినిపిస్తోంది. తనయుడు కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేస్తారనే ప్రచారం సాగుతున్న నేపథ్యంలో.. మరి కేసీఆర్‌ ఎలాంటి బాధ్యతలు మోయనున్నారనే ప్రశ్న మొదలైంది. ప్రస్తుతం పార్టీ అధ్యక్షుడిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్‌ త్వరలోనే ఢిల్లీ రాజకీయాలపై దృష్టి పెట్టబోతున్నారని అంటున్నారు. కొద్ది నెలల్లో తెలంగాణ నుంచి రాజ్యసభ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. ముఖ్యంగా సీనియర్‌ నాయకుడు కేకే పదవీ కాలం త్వరలోనే ముగియబోతోంది. ఆ స్థానం నుంచి తొలుత కేసీఆర్‌ కుమార్తె కవిత రాజ్యసభకు వెళ్లనున్నారనే ప్రచారం సాగింది. కానీ, ప్రస్తుతం కేకే స్థానం నుంచి సీఎం కేసీఆర్‌ రాజ్యసభకు వెళ్లబోతున్నారనే టాక్‌ పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది.

కేసీఆర్‌ జాతీయ రాజకీయాలపై దృష్టి పెడతారనే వార్తలు జోరందుకున్న నేపథ్యంలో ఇక కేటీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యేందుకు మార్గం సుగమం అయినట్టేనని కార్యకర్తలు అనుకుంటున్నారు. కేటీఆర్‌ ఇప్పటికే పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా, మరోపక్క రాష్ట్ర మంత్రిగా తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారనే అభిప్రాయం ఏర్పడింది. కుమారుడిని సీఎం పీఠంపై కూర్చోబెట్టేందుకు సరైన సమయం కోసం ఎదురు చూస్తున్న కేసీఆర్‌.. అందుకు రాజ్యసభ ఎన్నికలే సరైనవిగా భావిస్తున్నారట.

కేసీఆర్‌ రాజ్యసభకు వెళ్తే కేటీఆర్‌కు లైన్‌ క్లియర్‌: 
నిజానికి మున్సిపల్‌ ఎన్నికల తర్వాత కేటీఆర్‌కు సీఎంగా బాధ్యతలు అప్పగిస్తారని అనుకున్నారు. కానీ, సీఎం కుర్చీ దిగే ముందు ఆయన చక్కబెట్టాల్సిన కొన్ని పనులు ఉన్నాయంటున్నారు. కొత్త రెవెన్యూ చట్టంతో పాటు విద్యుత్‌ చార్జీల పెంపు, ఉద్యోగులకు పీఆర్సీ అంశాలపై నిర్ణయాలు తీసుకోవలసి ఉంది. అలాగే అసెంబ్లీ సమావేశాలను నిర్వహించి, కొత్త బిల్లులు ఆమోదం పొందే సమయానికి కేకే పదవీ కాలం కూడా పూర్తవుతుంది. అప్పుడు ఒకేసారి ఆయన రాజ్యసభకు, కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేసే పనిని చేపట్టాలనే ఆలోచనలో ఉన్నారంటున్నారు.

గజ్వేల్‌ నుంచి బరిలోకి కవిత?
ఒకవేళ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాజ్యసభకు వెళ్లి, కేటీఆర్‌ను సీఎంను చేస్తే.. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌ నుంచి ఎవరు బరిలోకి దిగుతారనే చర్చ మొదలైంది. ఇందుకు సమాధానంగా కేసీఆర్‌ కుమార్తె కవిత అయితేనే కెరక్ట్‌ అని పార్టీ వర్గాలు అంటున్నాయి. గజ్వేల్‌ నుంచి కవితను గెలిపించుకొని, మంత్రి పదవి ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది. మొత్తం మీద ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇదే చర్చ జరుగుతోందని జనాలు అనుకుంటున్నారు. మరి కేసీఆర్‌ ఏం చేస్తారో వేచి చూడాల్సిందే.

Also Read : 3 రాజధానులు.. శాసనమండలి రద్దు : జగన్‌ను నడిపిస్తున్న అదృశ్య శక్తి ఏంటి..?