మధ్యంతర బడ్జెట్ పై సీఎం కేసీఆర్ సమీక్ష

  • Publish Date - February 2, 2019 / 07:10 PM IST

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం త్వరలో మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. మధ్యంతర బడ్జెట్ రూపకల్పనపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈమేరకు మధ్యంతర బడ్జెట్ పై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. బడ్జెట్ రూపకల్పనపై అధికారులకు కేసీఆర్ పలు సూచనలు చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేసే దిశగా.. బడ్జెట్ రూపకల్పన జరగాలని అధికారులను ఆయన ఆదేశించారు. నీటి ప్రాజెక్టులకు బడ్జెట్ లో ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం అన్నారు.