ఆర్టీసీలో కొత్త నియామకాలు, విధుల్లో ఉన్నవారికే జీతాలు : సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం

ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. విధుల్లో ఉన్న ఆర్టీసీ కార్మికులకు మాత్రమే సెప్టెంబర్ జీతాలు ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

  • Publish Date - October 12, 2019 / 11:20 AM IST

ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. విధుల్లో ఉన్న ఆర్టీసీ కార్మికులకు మాత్రమే సెప్టెంబర్ జీతాలు ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. విధుల్లో ఉన్న ఆర్టీసీ కార్మికులకు మాత్రమే సెప్టెంబర్ జీతాలు ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. చట్టవిరుద్ధంగా నడుస్తున్న సమ్మెను ప్రభుత్వం గుర్తించదన్నారు. సమ్మె చేస్తున్న వారితో చర్చలు ఉండవు అని తేల్చి చెప్పారు. విధులకు హాజరుకాని ఉద్యోగులను తిరిగి చేర్చుకునే ప్రసక్తే లేదన్నారు. యూనియన్ నేతల బాధ్యతారాహిత్యం వల్లే 48వేల మంది ఉద్యోగాలు కోల్పోయారని చెప్పారు. 3 రోజుల్లో 100శాతం ఆర్టీసీ బస్సులు నడవాలని సీఎం ఆదేశించారు. అందుకోసం అవసరమైన సిబ్బందిని వెంటనే నియమించాలన్నారు.

కొత్తగా తాత్కాలిక కండక్టర్లు, డ్రైవర్లను విధుల్లోకి తీసుకోవాలన్నారు. భారీ వాహనాలు నడిపిన అనుభవం ఉన్నవారినే డ్రైవర్లుగా తీసుకోవాలన్నారు. రిటైర్డ్ ఆర్టీసీ డ్రైవర్లు, పోలీస్ డ్రైవర్లను ఉపయోగించుకోవాలని సూచించారు. 30శాతం అద్దె, 20శాతం ప్రైవేట్ బస్సులకు స్టేజ్ క్యారేజీలుగా రూట్ పర్మిట్లు ఇవ్వాలని చెప్పారు.

అద్దె బస్సుల కోసం వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలని సీఎం ఆదేశించారు. ఆర్టీసీ సమ్మె, ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై శనివారం(అక్టోబర్ 12,2019) సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. రవాణశాఖ మంత్రి పువ్వాడ అజయ్, ఆర్టీసీ అధికారులతో మాట్లాడారు. భేటీలో సీఎం కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 3 రోజుల్లో ఆర్టీసీ బస్సులు పూర్తి స్థాయిలో నడపాలని అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

యూనియన్ల బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని సీఎం కేసీఆర్ తేల్చి చెప్పారు. ప్రజలకు, ఆర్టీసీకి నష్టం కలిగించిన కార్మికులను క్షమించేది లేదని సీఎం అన్నారు. చట్టవిరుద్ధ సమ్మెకు రాజకీయపక్షాల మద్దతు అనైతికం అని మండిపడ్డారు. యూనియన్ నేతల మాటలు నమ్మి కార్మికులు ఉద్యోగాలు కోల్పోయారని సీఎం అన్నారు. ఆర్టీసీ సమ్మెపై మాట్లాడుతున్న బీజేపీ.. రైల్వే ప్రైవేటీకరణపై ఏం చెబుతుందని సీఎం కేసీఆర్ అడిగారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. రైల్వే, ఎయిర్ లైన్స్ ను ప్రైవేటీకరిస్తుంది.. చివరికి సికింద్రాబాద్ రైల్వేనూ ప్రైవేటీకరిస్తుందని మండిపడ్డారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రైల్వేను ప్రైవేటుపరం చేస్తుంది.. తెలంగాణలో మాత్రం ఆర్టీసీని ప్రభుత్వంలో కలపమంటారా అని బీజేపీని సీఎం నిలదీశారు.

Also Read : ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్ : అక్టోబర్ 19 వరకు విద్యాసంస్థలకు సెలవులు