చలి పులి మళ్లీ పంజా విసిరింది. హైదరాబాద్ లో చలి తీవ్రత కొనసాగుతోంది.
హైదరాబాద్ : చలి పులి మళ్లీ పంజా విసిరింది. నగరంలో చలి తీవ్రత కొనసాగుతోంది. చల్లటి గాలులు వీస్తున్నాయి. చలికి జనం గజ గజ వణుకుతున్నారు. బయటికి రావాలంటేనే భయపడుతున్నారు. ఉదయం 10 నుంచి 10.30 వరకు చలి తీవ్రత ఉంటుంది. పొగ మంచు కమ్ముకుంటుంది. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బుధవారం నగరంలో 10.9 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు అయింది.
సాధారణ సగటుతో పొలిస్తే నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రతలు పడిపోయాయి. పగటి పూట 29.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. జనవరి 13వ తేదీ వరకు చలి తీవ్రత ఉండే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వచ్చే నాలుగు రోజుల పాలు రాత్రి వేళల్లో 10 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయని తెలిపింది. ఈ వారం రోజులపాటు పొగ మంచు తీవ్రత పెరిగే అవకాశం ఉంది.