తెలంగాణలో చలి గాలులు మొదలయ్యాయి. ఇకపై చలి పెరుగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
తెలంగాణలో చలి గాలులు మొదలయ్యాయి. ఇకపై చలి పెరుగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. డిసెంబర్ మొదటివారంలో చలి తీవ్రమయ్యే అవకాశం ఉన్నదని వెల్లడించింది. ప్రస్తుతం తూర్పు, ఈశాన్య దిశల నుంచి గాలులు వీస్తున్నట్టు అధికారులు తెలిపారు.
తెలంగాణలో రాగల మూడ్రోజులవరకు పొడి వాతావరణం ఉంటుందని చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్‌లోనూ చలి పెరిగింది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువకు పడిపోతున్నాయి. మధ్యాహ్నం సమయంలో కూడా వాతావరణం చల్లగా మారింది. కొన్ని రోజులుగా చలి తీవ్రత అధికంగా ఉంది.
తెల్లవారుజామున చలి గాలులు వీస్తున్నాయి. నిద్ర లేవాలంటేనే జంకుతున్నారు. చలికి గజగజ వణుకుతున్నారు. వాతావరణం మంచు దుప్పటి కప్పేసినట్లుగా ఉంది. రాష్ట్రం వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. అడవులు, చెట్లు అధికంగా ఉన్న ప్రాంతాల్లో చలి మరింత ఎక్కువగా ఉంది.