హైదరాబాద్ లో హాయిగా బతకొచ్చు :  సౌకర్యవంతమైన నగరం  

  • Publish Date - February 12, 2019 / 07:41 AM IST

హైదరాబాద్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భావించిన తర్వాత  హైదరాబాద్‌ నగరం ప్రపంచంలోనే అత్యంత నివాసయోగ్యమైన ప్రాంతంగా రూపొందిందని హోంమంత్రి మహమూద్‌ అలీ  అన్నారు.   జీహెచ్ఎంసీ మేయర్‌గా బొంతు రామ్మోహన్‌ నేతృత్వంలోని పాలక మండలి మూడేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన కేకు కట్‌ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిబద్ధతతో పని చేయడం మూలానే నగరానికి అవార్డులు వస్తున్నాయని ఆయన కితాబిచ్చారు.

నగరంలో రోడ్ల పరిస్ధితి ఇప్పటికే చాలా వరకు మెరుగుపడిందని, మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కోన్నారు. నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్‌ రద్దీని దష్టిలో ఉంచుకొని జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేస్తున్న సిగ్నల్‌ ఫ్రీ వ్యవస్థలను హోం మంత్రి  మెచ్చుకున్నారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న లక్ష డబుల్‌ బెడ్ రూం ఇళ్లలో ఇప్పటికే 36 వేల నిర్మాణాలు పూర్తయ్యాయని, వాటిని బలహీన వర్గాలకు అందించేందుకు మార్గ దర్శకాలు  రూపోందిస్తున్నామని మహమూద్ ఆలీ చెప్పారు. భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకుని  ప్రణాళికలు  రూపోందించి , అమలయ్యే విధంగా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని హోంమంత్రి సూచించారు. 

మూడేళ్ల కాలంలో చేసిన పని సంతప్తినిచ్చిందని నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌ పేర్కొన్నారు. హైదరాబాద్‌ నగర వాసుల కోసం ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని, నగరంలోని వివిధ వర్గాల సహాయ సహకారాలతో పనులు పూర్తి చేస్తామని తెలిపారు.