జిల్లా పరిషత్ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్.. జిల్లా పరిషత్ ఛైర్మన్ అభ్యర్థులను ప్రకటించింది. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరుగురు అభ్యర్థుల పేర్లను అనౌన్స్ చేశారు. మరికొన్ని రోజుల్లో మిగతా అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తామన్నారు.
* ఆదిలాబాద్ – చారులత రాథోడ్
* మహబూబాబాద్ – ఇస్లావత్ పార్వతి
* మహబూబ్ నగర్ – జె. దుష్యంత్ రెడ్డి
* మంచిర్యాల – మద్ది రమాదేవి
* నల్గొండ – కోమటిరెడ్డి మోహన్ రెడ్డి
* నాగర్ కర్నూలు – అనురాధ వంశీ కృష్ణ
రాష్ట్రంలోని ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు మూడు విడతల్లో ఎన్నికలు జరుగనున్నాయి. మే 6, 10, 14 తేదీల్లో ఎన్నికలు నిర్వహిస్తారు. మే 27న ఫలితాలు విడుదల చేస్తారు. మొదటి విడతలో ఎన్నికలు జరిగే 197 జెడ్పీటీసీలు, 7వేల 017 ఎంపీటీసీలకు నామినేషన్ల పర్వం ముగియగా.. అభ్యర్థులు ఇప్పటికే ప్రచారం ప్రారంభించారు. రెండో విడతలో ఎన్నికలు జరిగే 1,913 ఎంపీటీసీలు, 180 జెడ్పీటీసీలకు నామినేషన్ల దాఖలు ముగిసింది. మూడో విడత ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ మంగళవారం (ఏప్రిల్ 30, 2019) నుంచి ప్రారంభమైంది. మూడో విడతలో 31 జిల్లాల పరిధిలో 161 జెడ్పీటీసీ, 1738 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. మే 2వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. మూడో విడత పోలింగ్ 14వ తేదీ ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది.