హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ కు మరో షాక్ తగిలింది. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఆ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు. టీఆర్ఎస్ గూటికి చేరనున్నారు. మార్చి 17 ఆదివారం ఫామ్ హౌస్ లో సీఎం కేసీఆర్ ను వనమా కలిశారు. టీఆర్ఎస్ లో చేరతానని వెల్లడించారు. అసవరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు. అనేక సంక్షేమ, అభివృద్ధి పనులను సీఎం కేసీఆర్ చేపడుతున్నారని తెలిపారు. కేసీఆర్ నాయకత్వాన్ని బలపర్చాల్సిన అవసరం ఉందన్నారు.