తెలంగాణ సీజేగా రాధాకృష్ణన్ ప్రమాణం

  • Publish Date - January 1, 2019 / 07:15 AM IST

తెలంగాణ ప్రత్యేక హైకోర్టు కొలువుదీరింది. జస్టిస్‌ రాధాకృష్ణన్‌ హైకోర్టు తొలి చీఫ్ జస్టిస్‌గా బాధ్యతలు స్వీకరించారు. రాజ్‌భవన్‌లో రాధాకృష్ణన్‌తో గవర్నర్‌ నరసింహన్‌ ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి.. ఇతర న్యాయమూర్తులతో హైకోర్టు ఆవరణలో ప్రమాణ స్వీకారం చేయించారు. సీఎం కేసీఆర్‌ చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. విభజన చట్టం ప్రకారం తెలంగాణ హైకోర్టుకు 24మంది జడ్జీలను కేటాయించారు. ప్రస్తుతం 13మందితో ప్రత్యేక హైకోర్టు ప్రారంభమైంది. ఇందులో తెలంగాణకు కేటాయించిన 10 మంది, ప్రధాన న్యాయమూర్తి, బదిలీపై వచ్చిన ఇతర రాష్ట్రాలవారున్నారు.