జీహెచ్ఎంసీ ఎన్నికల విధుల్లో పాల్గోన్న పోలీసులకు మళ్లీ కరోనా
- murthy
- Published On : December 7, 2020 / 10:17 PM IST
corona positive in sr nagar ps cops : తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టి రికవరీ రేటు పెరుగుతున్న సమయంలో హైదరాబాద్ లోని పోలీసులకు మళ్లీ కరోనా పాజిటివ్ రావటం కలకలం రేపుతోంది. రాష్ట్ర ప్రభుత్వం కరోనా పరీక్షలు చేస్తున్నప్పటికీ తక్కువ సంఖ్యలోనే పాజిటివ్ కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. మరణాల రేటు కూడ తగ్గింది, రికవరీ రేటు పెరిగింది.
ఈ పరిస్ధితుల్లో నగరంలోని ఎస్సార్ నగర్ పోలీసు స్టేషన్ లో పని చేసే నలుగురు ఎస్సైలు, నలుగురు కానిస్టేబుళ్ళకు, కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లకు రెండో సారి కోవిడ్ నిర్ధారణ అయ్యింది. వీరికి జూన్ లో ఒకసారి రాగా మళ్లీ ఇప్పుడు రెండోసారి కరోనా రావటంతో ఆందోళన చెందుతున్నారు. వీరంతా ఇటీవల జరిగిన కార్పోరేషన్ ఎన్నికల విధుల్లో పాల్దోనడం మరింత ఆందోళనకు గురి చేస్తోంది.
