Tech Mahindra Bhavana: లీవ్ అడిగితే జాబ్ తీసేసారు.. టెక్ మహీంద్రా వద్ద ఉద్యోగిని ఆవేదన.. పోలీసులకు ఫిర్యాదు
టెక్ మహీంద్రా(Tech Mahindra Bhavana)లో పనిచేస్తున్న భావన అనే మహిళా సాఫ్ట్వేర్ ఇంజినీర్, కంపెనీ వేధింపులపై దుండిగల్ పోలీసులను ఆశ్రయించడం సంచలనంగా మారింది.
Tech mahindra employee bhavana files police complaint over termination
- సాఫ్ట్వేర్ ఉద్యోగిని సంచలన ఆరోపణలు
- అనుమతి లేనిదే వాష్‌రూమ్‌కు వెళ్లలేం
- టెక్ మహీంద్రా వద్ద ధర్నా
Tech Mahindra Bhavana: హైదరాబాద్‌లోని ప్రముఖ ఐటీ సంస్థ టెక్ మహీంద్రా(Tech Mahindra)లో పనిచేస్తున్న భావన అనే మహిళా సాఫ్ట్వేర్ ఇంజినీర్, కంపెనీ వేధింపులపై దుండిగల్ పోలీసులను ఆశ్రయించడం సంచలనంగా మారింది. అనారోగ్యం, చిన్నారి వైద్య అత్యవసరాల కారణంగా సెలవు తీసుకున్నందుకు తనను అకారణంగా ఉద్యోగం నుంచి తొలగించారని ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఫిర్యాదు అనంతరం ఆమె సదరు కంపెనీ వద్ద ధర్నాకు దిగారు.
Also Read – Ather Voice Feature: ఈ స్కూటీ మీతో మాట్లాడుతుంది.. ‘ఆథర్’లో అద్భుతమైన ఫీచర్.. ఏది అడిగినా చెప్తుంది!
వాష్రూమ్కూ పర్మిషన్ కావాలా?
వైద్య నివేదికలు సమర్పించినప్పటికీ యాజమాన్యం నిరంతరం మెయిల్స్, కాల్స్‌తో తీవ్ర ఒత్తిడి తెచ్చిందని భావన తెలిపారు. కనీసం వాష్‌రూమ్‌కు వెళ్లాలన్నా ముందస్తు అనుమతి తప్పనిసరి చేసే విచిత్రమైన కఠిన నిబంధనలు అక్కడ అమలు అవుతున్నాయని ఆరోపించారు. మహిళా ఉద్యోగుల పట్ల కార్పొరేట్ సంస్థలు కనీస మానవత్వంతో వ్యవహరించాలని, వృత్తి జీవితంలో ఇటువంటి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే సంస్కృతిని ఎప్పుడూ చూడలేదని పేర్కొన్నారు.
బాధితురాలి ధర్నా: స్పందించని యాజమాన్యం:
ముందస్తు నోటీసు, వివరణ లేకుండా తనను ఉద్యోగం నుంచి తీసివేయడంపై న్యాయం చేయాలని ఆమె పోలీసులను కోరారు. ఈ ఆరోపణలపై టెక్ మహీంద్రా నుంచి ఇంకా ఎలాంటి అధికారిక స్పందన రాలేదు. ఐటీ రంగంలో వర్క్-లైఫ్ బ్యాలెన్స్, హక్కులపై ఈ ఘటన మరొకసారి చర్చను రాజేసింది.
