ఫీవర్‌ హాస్పిటల్‌లో కరోనా టెస్టులు ప్రారంభం

  • Publish Date - March 26, 2020 / 05:03 AM IST

హైదరాబాద్ నల్లకుంటలోని ఫీవర్‌ హాస్పిటల్‌లో బుధవారం (మార్చి 25, 2020) నుంచి కరోనా పరీక్షలు ప్రారంభమయ్యాయి. ట్రయల్‌ కోసం 22 కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇప్పటి వరకు ఇక్కడ కరోనా అనుమానితులను ఐసోలేటెడ్‌ వార్డులో పెట్టి వారి దగ్గర సేకరించిన శాంపిళ్లను గాంధీ, ఉస్మానియా హాస్పిటల్‌కు పంపించి పరీక్షలు నిర్వహించేవారు. 

కానీ, ఇప్పటినుంచి ఇక్కడే పరీక్షలు మొదలయ్యాయని హాస్పిటల్ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కె.శంకర్‌ తెలిపారు.  అందుకు సంబంధించిన యంత్రపరికరాలను, రసాయనాలను తెప్పించాము. ఇకనుంచి ఇక్కడే కరోనా పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. ఇందుకు సంబంధించి ఆక్సిజన్‌, ప్రత్యేక మాస్క్‌లను కూడా తెప్పించామన్నారు.

ఇక తాజాగా యూకేలో ఎలాంటి అనారోగ్యం లేకుండానే… కరోనా వైరస్ బారిన పడి 21ఏళ్ల అమ్మాయి మరణించింది. చలోయి కుటుంబ సభ్యులు ఆమెకు గతంలో ఎటువంటి అనారోగ్యం లేదని చెప్పారు. అందుకే ఈ ప్రాణాంతక వైరస్ ను తేలికగా తీసుకోవద్దని, ప్రజలంతా ఇంట్లోనే వుండాలని డాక్టర్లు విజ్ఞప్తి చేస్తున్నారు.

Also Read | Parle-G సంస్థ.. పేదల కోసం 3 కోట్ల బిస్కెట్ పాకెట్లను విరాళం