చైనాలో పుట్టిన కరోనా వైరస్(corona virus) మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. వేలాది మంది ప్రాణాలు బలితీసుకుంది. సుమారు 80వేల మంది కరోనా(covid19) బారిన
చైనాలో పుట్టిన కరోనా వైరస్(corona virus) మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. వేలాది మంది ప్రాణాలు బలితీసుకుంది. సుమారు 80వేల మంది కరోనా(covid19) బారిన పడ్డారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రభావం చూపుతోంది. కరోనా ఎఫెక్ట్ పౌల్ట్రీ రంగంపైనా తీవ్రమైన ప్రభావం చూపింది. చికెన్, గుడ్లు(chicken, eggs) తింటే కరోనా వస్తుందనే ప్రచారంతో వాటిని తినే వారు తగ్గిపోయారు. కోడి కూర పేరు చెబితేనే పరుగులు జనాలు తీస్తున్నారు. కరోనా వైరస్ భయాలు చికెన్ మార్కెట్‌పై పడ్డాయి. చికెన్ తింటే కరోనా వస్తుందనే పుకార్లు పౌల్ట్రీ పరిశ్రమ దెబ్బతీశాయి. పౌల్ట్రీ పరిశ్రమ తీవ్రమైన సంక్షోభంలో కూరుకుపోయింది. బిజినెస్ పడిపోవడంతో పౌల్ట్రీ రైతులు ఆందోళన చెందుతున్నారు. కరోనా దెబ్బతో పౌల్ట్రీ రంగం కోట్ల రూపాయల నష్టం చూసింది.
చికెన్ తింటే కరోనా రాదు:
చికెన్, గుడ్లు తింటే కరోనా వస్తుందనేది అవాస్తవమని నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ చెబుతోంది. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజాలో ‘చికెన్, ఎగ్ మేళా’(chicken mela) నిర్వహించింది నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ. దీనికి తెలంగాణ మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్, తలసాని శ్రీనివాస్‌యాదవ్, శ్రీనివాస్‌గౌడ్, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, సినీ నటి రష్మిక హాజరయ్యారు. చికెన్, గుడ్డు తింటే కరోనా రాదని మంత్రుల స్పష్టం చేశారు. చికెన్, గుడ్డు వినియోగం విషయంలో సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మొద్దన్నారు. చికెన్ తింటే కరోనా వస్తుందనే వార్తలు పుకార్లే అని తేల్చారు. ఎలాంటి భయం, టెన్షన్ లేకుండా చికెన్ తినాలని ప్రజలకు సూచించారు.
వైరస్ బతికే చాన్సే లేదు:
ఈ సందర్భంగా చికెన్ లాగించిన నేతలు.. భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. మా ఇంట్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు అందరం చికెన్ తింటున్నాం.. మీరూ తినండి అని మంత్రి కేటీఆర్ ప్రజలను కోరారు. పౌల్ట్రీ క్యాపిటల్ ఆఫ్ ఇండియా తెలంగాణ అని కేటీఆర్ తెలిపారు. తెలంగాణలో పండే మొక్కజొన్న రైతులకు పౌల్ట్రీ రంగం అండగా ఉందని గుర్తు చేసిన ఆయన.. ఎగ్, చికెన్‌లో ఉండే పౌష్టికాహారం మరెందులోనూ లేదని స్పష్టం చేశారు. చికెన్ ద్వారా తక్కువ ధరకు పౌష్టికాహారం లభిస్తుందన్న కేటీఆర్.. చికెన్ వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాలేదని ప్రకటించారు. చికెన్‌కు కరోనా వైరస్‌తో సంబంధం లేదని స్పష్టం చేశారాయన. చికెన్‌పై దుష్ప్రచారాలు, అపోహలు నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. ఎగ్, చికెన్, మటన్, ఫిష్ వేటికీ కరోనా లేదని.. మనం వండుకునే విధానంలో అలాంటి వైరస్‌లు బతికే ఛాన్స్ లేదని కేటీఆర్ స్పష్టం చేశారు.
చికెన్ కి, కరోనాకి సంబంధమే లేదు:
చికెన్‌కి, కరోనా వైరస్‌కి సంబంధమే లేదని మరో మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. చికెన్ తింటే కరోనా వస్తుందనేది నిజం కాదన్నారు. మనం తీసుకునే ఆహారం వల్ల కరోనా వైరస్ రాదన్నారు. అందరూ చికెన్, గుడ్డు తినొచ్చని పిలుపునిచ్చారు. చికెన్ తింటే కరోనా వస్తుందనే అపోహతో పౌల్ట్రీ రంగం రూ.500 కోట్లు నష్టపోయిందని ఈటల వాపోయారు. చదువుకున్న వాళ్లు కూడా అపోహలు నమ్మడం బాధాకరం అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. లక్షల మంది పౌల్ట్రీ పరిశ్రమపై ఆధారపడి ఉన్నారని గుర్తు చేశారు.
“#Coronavirus and chicken are nowhere connected. Me and my members are eating chicken and eggs everyday,” said @KTRTRS while speaking at Chicken and Egg mela organised by National Egg Co-ordination Committee at Peoples Plaza #Hyderabad on Friday. Photos: @meetsenbaga pic.twitter.com/I9JhzHFppj
— TNIE Telangana (@XpressHyderabad) February 28, 2020