ఎవరికి భయపడను : ప్రజలు కోరుకున్న పాలనే మా లక్ష్యం  

  • Publish Date - February 25, 2019 / 09:09 AM IST

హైదరాబాద్ : రాష్ట్ర ప్రజల యొక్క మంచి కాంక్షించే పాలన ఇవ్వటమే మా ప్రభుత్వ లక్ష్యమని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. నూటికి నూరు శాతం ప్రజలకు మేలు చేసే పాలన అందిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. బడ్జెట్ పై వస్తున్న విమర్శలను కేసీఆర్ తిప్పికొట్టారు. ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ జరిగిన అనంతరం సీఎం కేసీఆర్ సమాధానం ఇస్తు పలు విషయాలను ప్రస్తావించారు. చర్చలో ప్రతిపక్షాల నుంచి నిర్మాణాత్మకమైన సూచనలు సలహాలు రాలేదు కానీ అర్థం పర్థం లేని విమర్శలు చేస్తున్నారనీ..బడ్జెట్ పై కాంగ్రెస్ అవగానాలేమితో మాట్లాడుతున్నారనీ విమర్శించారు. అసంబద్ధమైన వాదనలతో  ప్రతిపక్షం సభను తప్పుదోవ పట్టించేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. 
 

కేంద్ర ప్రాధాన్యతలు చూసే బడ్జెట్ రూపొందించామనీ..బడ్జెట్‌లో వేటికి ఎంత కేటాయించామో వాటిని అమలు చేస్తామన్నారు. కేంద్రంలో ఏ ప్రభుత్వం వస్తుందో చెప్పలేమనీ..కేంద్రంలో అధికారంలోకి వచ్చే ప్రభుత్వ విధానాలను బట్టి రాష్ట్ర అవసరాలను మార్చుకోవాల్సి ఉంటుందన్నారు. రాబోయే రోజుల్లో నిర్మాణాత్మకంగా ముందుకెళ్తామనీ..పరిపాలన విషయంలో కూడా పెనుమార్పుల్ని ప్రవేశపెట్టి రాష్ట్రాభివృద్ధి విషయంలో పెను మార్పులు చూడబోతారని తెలిపారు. కాంగ్రెస్ చేసిన భూరికార్డులకు లెక్క లేదు.. పత్రం లేదనీ..గతంలో కూడా  టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై విపక్షాలు చాలా నిందలు వేశారనీ తాము చేపట్టిన పలు సంక్షేమ పథకాలపై విమర్శలు చేసారనీ..కానీ విపక్షాలు చేసిన ఆరోపణలను అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి టీఆర్ఎస్ ప్రభుత్వానికే పట్టం కట్టి ప్రజలు మాత్రం కాంగ్రెస్ ఆరోపణలు తప్పని..ప్రజా కోర్టు నిరూపించిందన్నారు. టీఆర్‌ఎస్ విధానాలు, పనులు తప్పయితే ప్రజలు రెండోసారి భారీ మెజార్టీతో గెలిపించేవారు కాదన్నారు. ఈ క్రమంలో ప్రజలు నమ్మకాన్ని నిలబెట్టుకుంటు పారదర్శకంగా పాలన అందిస్తామని కేసీఆర్ స్పష్టంచేశారు.