దిశ హత్యాచారం నిందితులను ఎన్ కౌంటర్ చేయడంతో తమ కుటుంబానికి న్యాయం జరిగిందని దిశ తండ్రి అన్నారు. ఎన్ కౌంటర్ పై మానవ హక్కుల కమిషన్ దాని పని అది
దిశ హత్యాచారం నిందితులను ఎన్ కౌంటర్ చేయడంతో తమ కుటుంబానికి న్యాయం జరిగిందని దిశ తండ్రి అన్నారు. ఎన్ కౌంటర్ పై మానవ హక్కుల కమిషన్ దాని పని అది చేస్తోందన్నారు. NHRC విచారణపై తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవన్నారు. చట్టానికి మేము వ్యతిరేకం కాదన్నారు. NHRC విచారణను తాము తప్పుపట్టడం లేదన్నారు. అమ్మాయిల రక్షణ కోసం కఠిన చట్టాలు తీసుకురావాలన్నారు. భవిష్యత్తుల్లో ఇలాంటి ఘటనలకు పాల్పడటానికి భయపడే విధంగా శిక్షలు ఉండాలని దిశ తండ్రి అన్నారు.
దిశ వ్యవహారంలో తమ కుటుంబానికి అండగా నిలిచిన తెలంగాణ ప్రభుత్వానికి, పోలీసులకు, మీడియాకు, ప్రజలకు దిశ తండ్రి ధన్యవాదాలు తెలిపారు. అత్యాచారం కేసుల్లో సత్వర న్యాయం కోరుకుంటున్నారని చెప్పారు.
దిశ నిందితుల ఎన్ కౌంటర్ ను దేశవ్యాప్తంగా ప్రజలు స్వాగతించారు. హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వాన్ని, పోలీసులను ప్రశంసించారు. సత్వర న్యాయం జరిగిందని అభిప్రాయపడుతున్నారు. అయితే కొందరు మహిళా సంఘాలు మాత్రం ఎన్ కౌంటర్ ను తప్పుపట్టాయి. ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన పోలీసులు.. ప్రాణాలు తియ్యడం ఏంటని ప్రశ్నించాయి. జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశాయి.
దీంతో ఎన్ హెచ్ఆర్సీ కమిటీ రంగంలోకి దిగింది. నిజనిర్ధారణ కోసం ప్రత్యేక బృందం ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చింది. ఎన్ కౌంటర్ కు దారితీసిన కారణాలను తెలుసుకోనుంది. ఇప్పటికే పోలీసులకు నోటీసులు ఇచ్చింది.