వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డిపై దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసిన దుర్మార్గులను ఉరి తీయాలని జాతీయ మహిళా కమిషన్ డిమాండ్ చేసింది. ప్రియాంక హత్య కేసును నేషనల్ మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది. హైదరాబాద్‌కు స్పెషల్ టీమ్ ను కూడా పంపింది. ఢిల్లీ నుంచి బయలుదేరిన మహిళా కమిషన్ సభ్యులు హైదరాబాద్ చేరుకోనున్నారు.అనతరం ప్రియాంక హత్యాచారంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయనుంది.
సంచలనం సృష్టించిన ప్రియాంక దారుణ హత్యపై జాతీయ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ రేఖా శర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతోమంది హైదరాబాద్ మహా నగరానికి ఉపాధికోసం వస్తుంటారు. ఇటువంటి పరిస్థితుల్లో హైదరాబాద్ లో మహిళలకు భద్రత లేకపోవటం విచారకరమని అన్నారు. మహిళలపై అఘాయిత్యం చేసేందుకు తోడేళ్లు వీధుల్లో యదేచ్ఛగా సంచరిస్తున్నట్లుగా ఇటువంటి ఘటనలతో అనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దారుణానికి పాల్పడిన దుర్మార్గులపై వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని రేఖా శర్మ డిమాండ్ చేశారు.
మహిళా కమిషన్ సభ్యులు వెంటనే బాధితురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి కావాల్సిన సాయం అందించి అండగా ఉంటారని.. రేఖా తెలిపారు. ఈ కేసులో వెంటనే దోషులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ఆమె హైదరాబాద్ పోలీసులకు లేఖ రాసారు.
A horrible & horrific incident happened in a city where many many young girls from all over country R working. How the hell we will make our daughters indipendent when they are not secure to move around?It’s like wolves out on prowl on roads.taking it up
https://t.co/RPo0qfdjdH— Rekha Sharma (@sharmarekha) November 29, 2019
Rekha Sharma, National Commission for Women Chairperson, on a woman veterinary doctor sexually assaulted & murdered in Telangana: It feels like there are wolves on streets who are just waiting to pounce on a woman. The culprits should be arrested soon & hanged, if found guilty. pic.twitter.com/8Vn38ztofX
— ANI (@ANI) November 29, 2019