జూబిలీహిల్స్ లో డ్రంక్ అండ్ డ్రైవ్.. పోలీసులకు చుక్కలు చూపించారు

  • Publish Date - November 21, 2019 / 02:55 AM IST

హైదరాబాద్‌ సిటీలోని కొన్ని ప్రాంతాల్లో బుధవారం (నవంబర్ 20, 2019)న అర్ధరాత్రి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్‌ను నిర్వహించారు. ఈ తనిఖీల్లో జూబ్లీహిల్స్ లోని డైమండ్ హౌస్ దగ్గర భారీ సంఖ్యలో మందుబాబులు పట్టుబడ్డారు. బ్రీత్ అనలైజర్ టెస్టుల్లో మందుబాబులు అడ్డంగా దొరికిపోయారు. పోలీసులకు చుక్కలు చూపించారు. మద్యం సేవించి ఉన్న వాళ్లంతా.. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. వీఐపీలు, ఎమ్మెల్యేల కొడుకులమంటూ గొడవ చేశారు. 

అంతేకాదు కొంతమంది అయితే పోలీసులను తప్పించబోయి డివైడర్లను ఢీకొట్టారు. ఈ డ్రైవ్‌ లో మొత్తం 22 కేసులు నమోదు చేశారు. ఇందులో నాలుగు కార్లు, మిగిలినవి బైక్‌లు ఉన్నాయి. వీరందరినీ సోమవారం (నవంబర్ 25, 2019)న కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు పోలీసులు.